Liger: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన పాన్ ఇండియా సినిమా 'లైగర్' కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 'లైగర్' సినిమా హిందీ వర్షన్ మాత్రం ఆలస్యంగా రిలీజ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 'లైగర్' సినిమా ఆగస్టు 25న ఐదు భాషల్లో విడుదల కానుంది. హిందీ వర్షన్ ఆలస్యంగా రిలీజ్ చేయడం కొత్త స్ట్రాటజీ అంటూ ప్రచారం జరుగుతోంది.
'లైగర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అనన్య పాండేలు జంటగా నటించిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మైక్ టైసన్, రమ్యకృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఆలస్యంగా రిలీజ్ కానున్న హిందీ వర్షన్
'లైగర్' (Liger) సినిమా హిందీ వర్షన్‌ను ఆగస్టు 25 సాయంత్రం రిలీజ్ చేయనున్నారు. 'లైగర్' టీమ్ బాలీవుడ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిందట. ప్రతీ చోట ఆగస్టు 25 ఉదయం నుంచి షోలు మొదలు కానున్నాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఆగస్టు 25 సాయంత్రం నుంచి మాత్రమే 'లైగర్' షో లు ప్రదర్శితమవనున్నాయట.
'బాయ్ కాట్ లైగర్' అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో 'లైగర్' హిందీ వర్షన్ బుక్సింగ్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు మేకర్స్. మిగతా భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్నా తరువాతే హిందీ వర్షన్ రిలీజ్ చేస్తారని టాక్. సినిమా బాయ్ కాట్ చేయాలనే వారికి బుద్ధి చెప్పాలనే ఇలా చేస్తున్నారంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'లైగర్' సినిమా హిట్ అవుతుందనేపై నమ్మకంతోనే కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్ ఈ నిర్ణయం తీసుకున్నారట.
కోట్లను కొల్లగొట్టేందుకు రెడీగా ఉన్న లైగర్
'లైగర్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా 'లైగర్' బిగ్ హిట్ అవుతుందనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. విడుదలైన ఒక్క రోజులోనే వంద కోట్లను కొల్లగొడుతుందా అనే రేంజ్‌లో 'లైగర్' బుక్సింగ్స్ సాగాయి. ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్లను కూడా ఓ రేంజ్‌లో నిర్వహించింది. ఇక ఈ సినిమా ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.
Follow Us