విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ) హీరోగా నటించిన ‘లైగర్’ సినిమా వీకెండ్ వరకు ఎంత కలెక్ట్‌ చేసిందంటే?

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ) హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా నెగెటివ్‌ టాక్ దక్కించుకుంది

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే కలెక్షన్లు ఏ రేంజ్‌లో ఉండాలి. సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే కలెక్షన్ల పరంగా రికార్డు ఓపెనింగ్స్ అయితే వచ్చి తీరాల్సిందే. అయితే పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాల మధ్య రిలీజైన లైగర్‌‌ సినిమా విషయంలో అలాంటివేం జరగడం లేదు.

భారీ అంచనాల మధ్య రిలీజైన విజయ్ దేవరకొండ లైగర్ సినిమా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాంతో భారీ కలెక్షన్ల మాట అటు ఉంచితే.. నిర్మాతలకు భారీ నష్టాలు మిగిల్చే దిశగా సినిమా కలెక్షన్లు ఉండనున్నాయని టాక్. అది కూడా ఇటీవల వచ్చిన సినిమాలన్నీ తెచ్చిన నష్టాల కంటే భారీ నష్టాలనే మిగిల్చే దిశగా లైగర్ సినిమా కలెక్షన్లు ఉన్నాయని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో లైగర్ సినిమా ఇప్పటివరకు కేవలం రూ.12.45 కోట్లు మాత్రమే వసూలు చేసింది. తెలుగులో లైగర్ సినిమాను దాదాపుగా రూ.60 కోట్లకు అమ్మేశారు నిర్మాతలు. ఇప్పటివరకు వసూలు చేసిన దానిని పక్కన పెడితే ఇక్కడ సేఫ్‌ కావాలంటే రూ.47 కోట్లు కలెక్ట్‌ చేయాలి.

ఏరియా వైజ్‌గా ఇప్పటివరకు లైగర్‌‌ వసూళ్లను పరిశీలిద్దాం..

నైజాం: 5.56  కోట్లు
సీడెడ్: 1.81 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.71 కోట్లు
ఈస్ట్: 0.86 కోట్లు
వెస్ట్: 0.55 కోట్లు
గుంటూరు: 0.99 కోట్లు
కృష్ణా: 0.68 కోట్లు
నెల్లూరు: 0.53 కోట్లు

ఏపీ, తెలంగాణ 4 రోజుల కలెక్షన్స్: 12.70 కోట్లు
కర్నాటక + రెస్టాఫ్ ఇండియా: 1.48 కోట్లు
మిగిలిన భాషల్లో: 0.80 కోట్లు
హిందీ: 6.30 కోట్లు
ఓవర్సీస్: 3.30 కోట్లు
వరల్డ్ వైడ్ నాలుగు రోజుల కలెక్షన్స్: 24.45 కోట్లు

లైగర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లకు అమ్మేశారు మేకర్స్. ఈ సినిమా సేఫ్ కావాలంటే అక్షరాలా రూ.100 కోట్లు కలెక్ట్‌ చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనీసం రూ.30 కోట్ల మార్కు కూడా అందుకునేలా కనిపించడం లేదు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్‌‌ సినిమా. ఈ నేపథ్యంలో సినిమా భారీ డిజాస్టర్‌‌గా మిగలడం ఖాయంగా కనిపిస్తోంది.

Read More : హిందీలో మంచి కలెక్షన్లతో దూసుకెళుతున్న విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda) లైగర్‌ !

You May Also Like These