Indraganti Mohanakrishna : 'ఇంద్రగంటి' చిత్రంలో .. విజయ్ దేవరకొండ నటిస్తున్నాడా .. లేదా ?

ఇటీవలే ఇంద్రగంటి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి

మంచి కథాబలం ఉన్న సినిమాలు చేసి, తనకంటూ ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ (Indraganti Mohanakrishna). అయితే నాని హీరోగా, ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన "V" చిత్రం మాత్రం ఆయనకు చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఆ చిత్రం, ఓటీటీలో విడుదలై కొంతలో కొంత సొమ్ము వెనకేసుకున్నా, అభిమానులు మాత్రం ఫ్లాప్‌గానే డిక్లేర్ చేశారు. 

ఇక ఇంద్రగంటి డైరెక్షన్‌లో గతంలో ఓ మంచి కమర్షియల్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ నిర్మించాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. విజయ్ దేవరకొండ (Vijaya Devarakonda) హీరోగా ఈ సినిమాలో నటించాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు అదే సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేయనున్నారని టాక్. అయితే హీరోని మారుస్తున్నారో లేదో తెలియదు. 

ఇటీవలే ఇంద్రగంటి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, బెంచ్ మార్క్ స్టూడియోస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. సుధీర్ బాబు,క్రితి శెట్టి హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే శ్రీనివాస అవసరాల కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. 

'గ్రహణం' సినిమా ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన ఇంద్రగంటి మోహనకృష్ణ 'అష్టాచెమ్మ' ఇచ్చిన హిట్‌తో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. గోల్కోండ హైస్కూల్, అంతకు ముందు.. ఆ తర్వాత, జెంటిల్ మేన్, అమీ తుమీ, సమ్మోహనం లాంటి సినిమాలు ఆయనకు మంచిపేరు తీసుకొచ్చాయి. 

Credits: Instagram
You May Also Like These