Tatineni Rama Rao: ప్ర‌ముఖ తెలుగు ద‌ర్మ‌కుడు తాతినేని రామారావు మృతి

టాలీవుడ్‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తాతినేని రామరావు కన్నుమూశారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన‌ య‌మగోల సినిమాకు ద‌ర్శ‌కుడుగా వ్య‌వ‌హ‌రించారు. తాతినేని రామారావు ప‌లు తెలుగు, హిందీ సినిమాల‌కు డైరెక్ష‌న్ చేశారు.

తాతినేని రామారావు 1938లో కృష్ణాజిల్లా క‌పిలేశ్వ‌పురంలో జ‌న్మించారు. తెలుగు, హిందీ భాష‌ల్లో 65 సినిమాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.1950 లలో సహాయ దర్శకునిగా త‌న బంధువులైన  టి.ప్రకాశరావు, కోటయ్య ద‌గ్గ‌ర ప‌నిచేశారు. తెలుగులో 1966 లో నవరాత్రి చిత్రంతో దర్శకునిగా త‌న కెరీర్ ప్రారంభించారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా రామారావు  "అగ్ని కెర‌టాలు" సినిమాకి దర్శకత్వం వహించారు. అలాగే శోభ‌న్‌బాబు హీరోగా, వాణిశ్రీ హీరోయిన్‌గా వ‌చ్చిన‌ "జీవ‌న త‌రంగాలు" సినిమాకు తాతినేని రామారావు ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.

హిందీలో ప‌లు హిట్ సినిమాల‌కు తాతినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జీవ‌న్ ధార‌, స‌న్‌సార్, మేరా ప్యార్ భార‌త్, రావ‌ణ్ రాజ్, బేటీ నంబ‌ర్ వ‌న్ మొదలైన హిందీ సినిమాలను ఆయన డైరెక్ట్ చేశారు. 
 

కొంత‌కాలంగా తాతినేని రామారావు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు.  చెన్నైలోని ఆయన నివాసంలో ఏప్రిల్ 19న‌ తుదిశ్వాస విడిచారు.

You May Also Like These