సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కచ్చితంగా ఉండేలా ప్లాన్ చే్స్తారు డైరెక్టర్లు. భక్తి , దేశభక్తి సినిమాల్లో వీటి అవసరం ఉండదు. కానీ అన్నమయ్య లాంటి సినిమాల్లో రొమాంటిక్ ఫీల్ ఉండే సన్నవేశాలు చిత్రీకరించారు. రొమాన్స్ కంటెంట్ లేకుండా కూడా సినిమాలు హిట్ కొట్టాయి. ఆ మూవీ విశేషాలను తెలుసుకుందాం.
ఆర్. ఆర్. ఆర్.
ఆర్. ఆర్. ఆర్. అంటే రౌద్రం, రణం, రుధిరం సినిమాలో రొమాంటిక్ సీన్స్ అస్సలు లేవు. అయినా థియేటర్లకు ప్రేక్షకులు క్యూలు కట్టారు. ఇండియానే షేక్ చేస్తుంది. ఒళ్లు గగ్గుర పొడిచే ఫైట్లు, పంచ్ డైలాగుల ముందు అలాంటి ఎలిమెంట్ అవసరం లేదు. యంగ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన సినిమా ఇది. వీరు పోరాట యోధులుగా నటించారు.
స్కైలాబ్
కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా స్కైలాబ్. నిత్యామీనన్, సత్యదేవ్ కలిసి చేసిన సినిమా. వీరి యాక్టింగ్ రియాలిటీకి దగ్గరగా ఉంది.
గేమ్ ఓవర్
థ్రిల్లర్ సినిమా గేమ్ ఓవర్. ఇంకా రొమాన్స్ సన్నివేశాలకు అవకాశమే ఉండదు. ఈ సినిమా విడుదలైన తర్వాత రొమంటిక్ ఎలిమెంట్ లేకున్నా హిట్ అయిందని ప్రశంసలు అందుకుంది.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
సినిమా పేరులోనే ఏజెంట్ ఉంటే ఇక రొమాన్స్ ఎలా ఉంటుంది. హీరోయిన్ పక్కనే ఉన్నా ఓ రొమాంటిక్ లుక్ కూడా ఉండని సినిమా. హీరోకి పంచులే ఉంటాయి.. ముద్దులు కాదు.
బ్రోచేవారెవరురా
ఈ సినిమాలు ఉండడానికి రెండు జంటలు ఉన్నాయి. వారు నివేదా థామస్ - శ్రీవిష్ణు, సత్య దేవ్ - వేదా పేతురాజ్ . రొమాంటిక్ ఎలిమెంట్ లేకుండా సాగే బ్రోచేవారెవరురా సినిమా ప్రేక్షకుల మెప్పు పొందింది.
రాజా వారు రాణి గారు
పేరులో రాజు, రాణి ఉన్నా వీరి మధ్య రొమాంటిక్ సీన్స్ లేవు. హీరో తన ప్రేమను ప్రియురాలకి చెప్పడంతోనే సినిమా ఎండ్ కార్డ్ పడిపోయింది.
మత్తు వదలరా
డబ్బు .. మోసం... ఇలాంటి కథాంశంతో సాగే చిత్రం. మోసాల చుట్టూ సాగే మత్తు వదలరా సినిమాలో రొమాంటిక్ పీల్ ఉన్న సన్నివేశాలకు స్కోప్ లేకుండా పోయింది.
ఓ! బేబి
పెద్దావిడ యంగ్ ఉమెన్ అవడం... ఎంజాయ్ చేయడం లాంటి సన్నివేశాలు ఉన్నాయి. ఓ బేబి సినిమాలో సమంతను ప్రేమించే నాగశౌర్యతో రొమాంటిక్ సీన్స్ లేవు.
హా
సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది. కామెడీ, హరర్ ఉన్నా రొమాన్స్ మాత్రం లేకుండా హా సినిమా తీశారు.
సినిమా బండి
మంచి సబెక్ట్ ఉన్న సినిమా. ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను మెప్పించింది.
ప్రతీ సినిమాలో రొమాంటిక్ సీన్స్ తప్పనిసరి కాదు. కథను బట్టి అవసరం అనుకుంటే తీస్తారు. అనవసరం అనుకుంటే చేయరు.
Follow Us