Telugu Actress: 2022లో టాలీవుడ్ (Tollywood) లోకి పలువురు హీరోయిన్లు అరంగ్రేటం చేశారు. కొందరు హీరోయిన్లు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరికొందరు గ్లామర్ పాత్రలో నటించి మెప్పించారు. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్.. ఇలా పలు భాషలకు చెందిన హీరోయిన్లు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
2022లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అలియా, నజ్రియా, మృణాల్ వంటి హీరోయిన్లు తమ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 2022లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్లపై పింక్ విల్లా ప్రత్యేక కథనం.
అలియా భట్ - ఆర్ఆర్ఆర్
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరు అలియా భట్. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అలియా భట్ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తెలుగులో మొదటి సినిమాతోనే అలియా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించారు.
'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ లెవల్ సినిమా అంటూ పలువురు ప్రశంసించారు. ఈ సినిమాలో అలియా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అలియా ఈ ఏడాది పెళ్లి చేసుకోవడంతో పాటు ఓ బిడ్డకు జన్మనిచ్చారు.
మృణాల్ ఠాకూర్ - సీతారామం
అందం దారి మళ్లి టాలీవుడ్‌లోకి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) రూపంలో అడుగుపెట్టింది. 'సీతారామం' సినిమాలో మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మృణాల్ 'సీతారామం' కన్నా ముందు పలు హిందీ సినిమాల్లో నటించారు.
నజ్రియా నజీమ్ - అంటే సుందరానికీ
నజ్రియా నజీమ్ మలయాళ నటి. యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నజ్రియా.. సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 2006లో 'పలుంకు' అనే మలయాళ సినిమాతో బాలనటిగా నజ్రియా నటించారు. 2013లో విడుదలైన 'మాడ్ డాడ్' సినిమాతో హీరోయిన్‌గా మారారు. మలయాళ, తమిళ్ సినిమాలలో పాపులర్ అయిన నజ్రియా.. నాని హీరోగా నటించిన 'అంటే సుందరానికీ' సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమయ్యారు.
సంయుక్త మీనన్ - భీమ్లా నాయక్
2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ సినిమాతో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా సినీ కెరీయర్ ప్రారంభించారు. సంయుక్త మీనన్ పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు 'గాలిపట 2' చిత్రంతో కన్నడ సినిమాల్లోకి అడుగుపెట్టారు.
రచితా రామ్ - సూపర్ మచ్చి
2022లో విడుదలైన 'సూపర్ మచ్చి' సినిమాతో రచితా రామ్ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడైన కళ్యాణ్ దేవ్ సరసన రచితా రామ్ నటించారు.
మానస రాధాకృష్ణన్ - హైవే
మానస రాధాకృష్ణన్ బాల నటిగా పలు మలయాళ సినిమాల్లో నటించారు. 2022లో విడుదలైన 'హైవే' చిత్రం ద్వారా మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆనందర్ దేవరకొండకు జోడిగా మానస కృష్ణన్ నటించారు.
మిథిలా పాల్కర్ - ఓరి దేవుడా
2014లో విడుదలైన 'హనీమూన్' షార్ట్‌ఫిల్మ్‌తో మిథిలా పాల్కర్ యాక్టింగ్ కెరియర్ మొదలు పెట్టారు. మిథిలా పలు మరాఠీ, హిందీ సినిమాల్లో నటించారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'ఓరి దేవుడా' చిత్రంలో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు మిథిలా పాల్కర్.
షిర్లే సెటియా - కృష్ణ వ్రింద విహారి
షిర్లే సెటియా న్యూజిలాండ్‌కు చెందిన భారతీయ నటి. గాయనిగా, యూట్యూబర్‌గా షిర్లే గుర్తింపు తెచ్చుకున్నారు. 2020లో 'మస్కా' అనే హిందీ సినిమాతో యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టారు. టాలీవుడ్ హీరోయిన్‌గా 'కృష్ణ వ్రింద విహారి' సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా నటించారు.
రితిక నాయక్ - అశోకవనంలో అర్జున కల్యాణం
రితిక నాయక్ హీరోయిన్‌గా నటించిన మొదటి తెలుగు సినిమా 'అశోకవనంలో అర్జున కల్యాణం'. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడిగా నటించారు.
రజిషా విజయన్ - రామారావు ఆన్ డ్యూటీ
మలయాళంలో టీవీ యాంకర్‌గా వ్యవహరించిన రజిషా.. 2016లో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. 'అనురాగ కరిక్కిన్ వెల్లం' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమాలో నటనకుగాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఈ సంవత్సరం విడుదలైన రవితేజ సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'తో తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చారు.
Read More: ఐఎండీబీ (IMDB) మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ టాప్ 10 జాబితాలో ముగ్గురు తెలుగు హీరోలు!
Follow Us