ప్రభాస్ (Prabhas) ‘ఆదిపురుష్’ (Adipurush) లో హనుమంతుడిగా నటించిన 'దేవ‌ద‌త్త' ఎవరో తెలుసా..?

తాజాగా విడుద‌లైన 'ఆదిపురుష్' టీజ‌ర్‌లో (Adipurush Teaser) హ‌నుమంతుడి పాత్ర‌లో ఎవ‌రు న‌టించారు అని నెటిజ‌న్లు వెత‌కడం ప్రారంభించారు.

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సినిమా ‘ఆదిపురుష్’ (Adipurush). ఈ నేపథ్యంలో ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న అయోధ్య‌లోని స‌ర‌యు నది తీరాన గ్రాండ్‌గా 'ఆదిపురుష్' టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు మేకర్స్. విడుద‌లైన కొద్ది సేప‌టికే ఈ టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో, బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు.

అయితే, రామాయణం ఇతిహాసం నేపథ్యంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' (Adipurush) సినిమాలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటించారు? అనేది తెలుసుకోవాలనే కుతూహలం సినీ అభిమానుల్లో నెలకొంది. ఇక, ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ప్ర‌ధాన పాత్ర‌ల‌ను మాత్ర‌మే ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్ ఓంరౌత్ హ‌నుమంతుడి పాత్ర‌లో ఎవ్వ‌రూ న‌టిస్తున్నార‌నేది ప్ర‌క‌టించ‌లేదు. 

దీంతో తాజాగా విడుద‌లైన 'ఆదిపురుష్' టీజ‌ర్‌లో (Adipurush Teaser) హ‌నుమంతుడి పాత్ర‌లో ఎవ‌రు న‌టించారు అని నెటిజ‌న్లు వెత‌కడం ప్రారంభించారు. అయితే హ‌నుమంతుడి పాత్ర‌లో క‌నిపించిన అత‌ని పేరు 'దేవ‌ద‌త్త గ‌జాస‌న్ నాగే' (Devdatta Gajanan Nage). మ‌రాఠీ సీరియ‌ల్స్, సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  జై మల్హర్ సీరియల్ లో కండోబా పాత్రలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యాడు. 

'వీర్ శివాజీ', 'దేవ‌యాని', 'బాజీరావ్ మ‌స్తానీ' వంటి సినిమాల్లోనూ న‌టించాడు 'దేవ‌ద‌త్త గ‌జాస‌న్ నాగే' (Devdatta Gajanan Nage). అలాగే గతంలో డైరెక్టర్ ఓం రౌత్ తెర‌కెక్కించిన 'తాన్హాజీ', 'ది అన్ సంగ్ వారియ‌ర్' మూవీలో సూర్యాజీ మ‌లుస‌రే పాత్రలో నటించాడు.

‘‘నాకు హ‌నుమంతుడితో ప్రత్యేక అనుబంధం ఉంది. 17ఏళ్ల వ‌య‌సులోనే నేను వ‌ర్కవుట్ చేయ‌డం ప్రారంభించాను. నా మొదటి జిమ్ సెంట‌ర్‌కి 'హ‌నుమాన్ వ్యాయామశాల' అని పేరు పెట్టాను. 'ఆదిపురుష్' (Adipurush) మూవీలో హనుమంతుడిగా నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆ పాత్రలో నటించేందుకు నా శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాను’’ అని దేవ‌ద‌త్త గ‌జాస‌న్ నాగే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

Read More: 'ఆదిపురుష్' (Adipurush) గురించి ఆసక్తికర వార్త.. హిందీలో ప్రభాస్ కు (Prabhas) డబ్బింగ్ చెప్పింది ఎవరంటే..?

Credits: pinkvilla
You May Also Like These