సూపర్ స్టార్ కృష్ణ మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటుగా మారింది. ఆ విషాద సంఘటన మరువక ముందే టాలీవుడ్ (Tollywood) లో మరో విషాదం నెలకొంది. 'ఆ నలుగురు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ రచయిత మదన్ (Ramigani Madan) (రామిగని మదన్ మోహన్ రెడ్డి) కన్నుమూశారు. నవంబర్ 19 వ తేదీన మదన్ తుది శ్వాస విడిచారు.
దర్శకుడిగా మదన్
మదన్ అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండెపోటుతో పాటు, బ్రెయిన్ డెడ్ కావడంతో మదన్ మరణించారు. నటకిరీటి రాజేంద్రప్రసాద్ తీసిన టాలీవుడ్ (Tollywood) సినిమా “ఆ నలుగురు” చిత్రానికి రచయితగా పని చేసారు. 'ఆ నలుగురు' సినిమాతో మదన్ తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
మదన్ అసలు పేరు రామిగాని మదన్ మోహన్ రెడ్డి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో మదన్ జన్మించారు. కాలేజీ రోజుల్లో నాటకాలకు దర్శకత్వం వహించేవారు. సినిమాలపై ఆసక్తితో మదన్ హైదరాబాద్‌కు వచ్చారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ తరఫున కొన్ని టీవీ కార్యక్రమాలను రూపొందించారు.
'మనసంతా నువ్వే', 'సంతోషం' సినిమాలకు కెమెరామెన్ ఎస్.గోపాలరెడ్డి దగ్గర సహాయకుడిగా పనిచేశారు. 'కల్యాణ రాముడు', 'ఖుషీ ఖుషీగా' సినిమాలకు రచయితల దగ్గర సహాయకుడిగా వ్యవహరించారు. 'పెళ్ళైన కొత్తలో', 'గుండె ఝల్లుమంది', 'ప్రవరాఖ్యుడు' లాంటి చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించారు.
Read More: Tollywood: టాలీవుడ్‌లో సొంత జెట్ విమానాలు ఉన్న హీరోలు ఎవరో మీకు తెలుసా!
Follow Us