Junior NTR & Ram Charan: ప్రపంచవ్యాప్తంగా RRR కొత్త రికార్డు.. ట్విటర్‌లో నెం. 1 సినిమా టైటిల్ ఇదే !

ప్రస్తుతం మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది RRR. ఎక్కువసార్లు ట్వీట్ చేయబడిన టైటిల్‌గా RRR ప్రథమ స్థానంలో నిలిచి రికార్డును తిరగరాసింది

గ్రాఫిక్స్ మాయాజాలంతో సెల్యూలాయిడ్ పై ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను ప్రదర్శించే రాజమౌళి (SS Rajamouli) ఎంతో శ్రమించి పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన మూవీ RRR. ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా అలరించిందో అందరికీ తెలిసిన విషయమే. 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్  (Ram Charan Tej), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) కలిసి నటించిన ఈ RRR సినిమా ఉత్తరాది ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత హాలీవుడ్ సాంకేతిక నిపుణుల ప్రశంసలు కూడా అందుకుంది.  వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ. 1200 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి భారీ లాభాలనే ఆర్జించింది ఈ చిత్రం. 

థియేటర్ రిలీజ్‌ను పక్కన పెడితే..  నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన RRR హిందీ వెర్షన్ కూడా ఒక్క లెక్కలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా ఎందరో విదేశీ సినీ ప్రముఖుల ఆదరణను కూడా పొందుతోంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో విడుదలైన ఈ సినిమా, ఓటీటీలో ఉత్తమ రేటింగ్ పొందిన చిత్రంగానూ నిలిచింది. 

అద్భుతమైన వండర్

ప్రస్తుతం తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది RRR. వరల్డ్ వైడ్‌గా ఎక్కువసార్లు ట్వీట్ చేయబడిన సినిమా టైటిల్‌గా RRR ప్రథమ స్థానంలో నిలిచి కొత్త రికార్డును తిరగరాసింది. తాజాగా ఎవరో ఈ చిత్రానికి సంబంధించిన ఓ యాక్షన్ సీన్‌ను వీడియో క్లిప్ రూపంలో సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. 

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) వన్యప్రాణులతో బ్రిటీషర్ల మీదకు దూసుకెళ్లే సీన్ అది. ఇప్పుడు అదే సీన్ హాలీవుడ్‌లో చర్చలకు దారితీస్తోందట. 

విదేశీయుల పొగడ్తలు

చాలామంది విదేశీ టెక్నీషియన్స్ రాజమౌళి (SS Rajamouli) క్రియేటివిటీని ఈ సీన్‌కు ముడిపెడుతూ పొగడడం గమనార్హం. ఎవరో ఈ సీన్ క్లిప్‌ను ట్విటర్‌లో పోస్టు చేయగా, దానిని దాదాపు 10 మిలియన్ల మంది నెటిజన్లు వీక్షించడం విశేషం.

ఇప్పటి వరకు ట్విటర్ చరిత్రలో భారతదేశానికి సంబంధించి ఏ వీడియో కూడా ఇంతలా వైరల్ కాలేదట. దీంతో చాలామంది జూనియర్ ఎన్టీఆర్  (Junior NTR) నటనను ఒకవైపు పొగుడుతూనే, దర్శకుడు రాజమౌళిపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Read More: తెలుగు సినిమా ఆర్.ఆర్.ఆర్ (RRR)ను దాటి.. రేటింగ్‌లో దూసుకెళ్తున్న క‌న్న‌డ సినిమాలు !

You May Also Like These