Advertisement

Faria Abdullah: వాహ్వా అనిపించేలా 'ఫరియా అబ్దుల్లా' బెల్లీ డ్యాన్స్.. కుర్రాళ్లు ఫిదా.. వీడియో వైరల్!

టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన 'జాతి రత్నాలు' (Jathiratnalu Movie) సినిమా ఎంతగా సూపర్ హిట్ అయిందో తెలిసిన విషయమే. ఈ సినిమా ద్వారానే యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా సెన్సేషన్ గా మారింది. ఇక, ఈ మూవీలో ఫరియా క్యూట్ లుక్స్ కుర్రాళ్ళని మెస్మరైజ్ చేశాయి. హీరోయిన్ గా చేసింది ఒక్క సినిమానే అయినా.. 'బంగార్రాజు' సినిమాలో నాగార్జున, నాగచైతన్య సరసన ఐటమ్ సాంగ్.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' లో గెస్ట్ రోల్ చేసి జనాలను మెప్పించింది. 

అయితే తాజాగా.. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మొదటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఫరియా గతంలోనే చెప్పుకొచ్చింది. తాజాగా బెల్లీ డాన్స్‏తో అదరగొట్టింది ఈ చిన్నది. నాభి అందాలను చూపిస్తూ బెల్లీ డాన్స్ సూపర్బ్‏గా చేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. 

గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో స్టేజీ పైనే బెల్లీ డ్యాన్స్ తో కుర్రాళ్ల మతులు పొగొట్టింది ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). అలా చిట్టి నడుము ఊపుతుంటే ఇలా కుర్రాళ్ళ గుండెలు జారిపోయాయి. స్టన్నింగ్ హాట్ గా ఫరియా నాభి అందాలు చూపిస్తూ డ్యాన్స్ తో ఒక ఊపు ఊపేసింది. మెరుపు వేగంతో కాళ్ళని కదుపుతూ ఆమె చేసిన డ్యాన్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

ఒకవైపు ఆమె అందాలు మరోవైపు కళ్ళు చెదిరే డ్యాన్స్ తో కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) బెల్లీ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కుర్రాళ్ళ అరుపులు మామూలుగా లేవు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వామ్మో నీలో ఈ యాంగిల్‌ కూడా ఉందా చిట్టి అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్.

Read More: Faria Abdullah: వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న 'జాతిరత్నాలు' బ్యూటీ ఫరియా అబ్దుల్లా..!

Advertisement
You May Also Like These
Advertisement