Advertisement

Junior NTR: 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి అభిమానుల కోలాహలం.. ఎన్టీఆర్ కు ఘన స్వాగతం.. వీడియో వైరల్!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'బింబిసార'. ‘ఏ టైమ్ ట్రావెల్‌ టూ ఈవిల్ టూ గుడ్’ అనేది ట్యాగ్ లైన్. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలవుతోన్న ఈ సినిమాలో కథానాయికలుగా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. 

'బింబిసార' సినిమా నుంచి ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ (Bimbisara Trailer) కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

'బింబిసార' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ (Junior NTR) గెస్ట్‌ గా రాబోతున్నాడు అంటూ రెండు రోజుల క్రితమే అధికారికంగా ప్రకటన రావడంతో అప్పటి నుండే అభిమానులు ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు.

'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ (Bimbisara Pre Release Event) ప్రారంభమయిన కాసేపటికే శిల్పకళా వేదిక వద్ద నందమూరి అభిమానులు భారీగా చేరుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత చాలా రోజులకు ఎన్టీఆర్ ఓ వేదికపై కనిపిస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More: 'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదుగా..!

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement