Advertisement

Laal Singh Chaddha: అమీర్ ఖాన్ (Aamir Khan) నడక, నడవడిక నాకు ఎంతో ఇష్టం... మెగాస్టార్ చిరంజీవి!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌ల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ ప్రస్తుతం అద్వైత్ చంద‌న్ డైరెక్షన్‌లో 'లాల్ సింగ్ చద్దా' (Laal Singh Chaddha) చిత్రంలో నటిస్తున్నారు. అమీర్ ఖాన్ ప్రొడ‌క్షన్స్, వ‌యాకామ్ 18 పిక్చర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అమీర్ ఖాన్, నాగచైతన్య ఈ చిత్రంలో స్నేహితులుగా నటిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాను  మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నారు. 

‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన 'లాల్ సింగ్ చద్దా' ట్రైలర్‌, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో, ప్రమోషన్స్‌లో  వేగం పెంచారు మేకర్స్. అందులో భాగంగా ఆదివారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితోపాటు అమీర్ ఖాన్, నాగ చైతన్య పాల్గొన్నారు. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి సమర్పిస్తున్నారు.

‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ట్రైలర్‌ విడుదల చేసిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో గొప్ప నటుడు అనిపించుకున్నారు ఆమిర్‌ఖాన్. ఆయన నడక, నడవడిక నాకు ఎంతో ఇష్టం. ఆమిర్‌లాగే మేమూ నటించాలనుకుంటాం. కానీ, మాకున్న పరిమితుల వల్ల కుదరడం లేదు. ఆమిర్‌ నటనకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆయనపై ఉన్న ప్రేమ, బాధ్యతతో ఈ సినిమాకు సమర్పకుడిగా ఉన్నాను. తొందరపడి ఈ సినిమా విడుదలకు ఒప్పుకోలేదు. సినిమాను విడుదల చేస్తున్నందుకు గర్వపడుతున్నాను’ అని అన్నారు చిరంజీవి.

ఈ సందర్భంగా ఆమిర్‌తో నాగచైతన్య తెలుగులో డైలాగులు చెప్పించి అలరించారు. 'లాల్ సింగ్ చ‌ద్దా' సినిమాలో నాగ చైత‌న్య ఓ సైనికుడి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ పాత్ర‌తో నాగ చైత‌న్య‌కు బాలీవుడ్‌లో మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని క్రిటిక్స్ అంటున్నారు. బాలీవుడ్ దివా కరీనా కపూర్ 'లాల్ సింగ్ చ‌ద్దా'లో రూప పాత్ర‌లో న‌టిస్తున్నారు. క‌రీనా క‌పూర్ పోస్ట‌ర్‌ను చిరంజీవి త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ''‘లాల్ సింగ్ చద్దా’ ప్రేయసి ‘రూప’ని  మీకు పరిచయం చేస్తున్నాను.. వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క  మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’'' అని తెలిపారు.

‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha) సినిమా ట్రైలర్ లో హీరో పానీపూరి తినే ఒక సీన్ ఉంటుంది. ప్రెస్ మీట్ లో ట్రైలర్ ప్లే చేసిన తర్వాత ఈవెంట్ నిర్వాహకులు స్టేజిపై ఉన్న నాగ చైతన్య, అమీర్ ఖాన్, చిరంజీవికి పానీపూరి ఇవ్వగా చిరు, అమీర్ ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Read More: 'లాల్ సింగ్ చద్దా' తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పానీపూరి తినిపించుకున్న చిరంజీవి, అమీర్

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement