Advertisement

Nagarjuna & Aamir Khan: 'లాల్‌ సింగ్‌ చడ్డా' నాగ‌చైత‌న్య‌కు ఎలాంటి పేరును తీసుకువ‌స్తుందో చూడాలి : నాగార్జున

బాలీవుడ్ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) నటించిన తాజా చిత్రం 'లాల్‌ సింగ్‌ చడ్డా' (Laal Singh Chaddha). వయాకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారేలు సంయుక్తంగా నిర్మించారు. 

'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సమర్పిస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య, కరీనా కపూర్ నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కింది. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కాబోతోంది. 

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) సినిమా మూడు రోజులలో విడుదల కానున్న తరుణంలో ఏఎమ్‌బి సినిమాస్‌లో ప్రీమియర్‌ షో వేయడం జరిగింది. ఈ షోకి మెగాస్టార్ చిరంజీవి, అమిర్ ఖాన్, కింగ్ అక్కినేని నాగార్జున‌ (Akkineni Nagarjuna), నాగ‌చైతన్య‌, మెగానిర్మాత అల్లు అర‌వింద్, యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కార్తికేయ‌, ద‌ర్శ‌కులు మారుతి, హ‌రీష్ శంక‌ర్, నిర్మాత‌లు సురేశ్ బాబు త‌దిత‌రులు హాజ‌రయ్యారు.  

ప్రీమియ‌ర్ షో (Laal Singh Chaddha Premier Show) అనంత‌రం నాగార్జున మాట్లాడుతూ.. “లాల్ సింగ్ చద్దా ప్రతి ఒక్కరినీ లోపలి నుండి కదిలిస్తుందని మరియు ప్రేమ మరియు అమాయకత్వం అందరినీ జయించాలనే సాధారణ సందేశంతో వస్తుంది” అని వెల్లడించారు. ‘ఈ చిత్రం మనల్ని ఒకేసారి నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. ఆలోచించేలా చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. నాగ చైతన్య (Naga Chaitanya) నటుడిగా ఎదగడం చాలా అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. లాల్ సింగ్ చ‌డ్డాకు చాలా పాజిటివ్ టాక్ ఉంది. మ‌రి.. ఈ మూవీ ఏ రేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో.. నాగ‌చైత‌న్య‌కు ఎలాంటి పేరును తీసుకువ‌స్తుందో చూడాలి అని అన్నారు.

Read More: 'లాల్‌ సింగ్‌ చడ్డా' (Laal Singh Chaddha) ప్రీమియర్ షోలో పాల్గొన్న అమీర్ ఖాన్, చిరంజీవి

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement