RRR: 'బాహుబలి' చిత్రంతో తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశారు దర్శకుడు రాజమౌళి (SS Rajamouli). ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శక ధీరుడగా మారిపోయారు. రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల విడుదలైన 'ఆర్ఆర్ఆర్' భారతీయ సినిమా రంగంలో పలు రికార్డులను బ్రేక్ చేసింది.
'ఆర్ఆర్ఆర్' సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం రాజమౌళి దర్శకత్వానికి సెల్యూట్ చేస్తున్నారు. 'టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్' వేడుకల్లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' చిత్రంపై చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
హాలీవుడ్ సినీ ప్రముఖులతో రాజమౌళి భేటీ
'టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్'లో పాల్గొనేందుకు రాజమౌళి (SS Rajamouli) కి ఆహ్వానం అందింది. ఈ సినిమా వేడుకలు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 18 వరకు జరగనున్నాయి. ఈ ఫెస్టివల్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమాను కూడా ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ దర్శక, నిర్మాతలతో రాజమౌళి భేటీ కానున్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పలువురు సినీ ప్రముఖులను కలవనున్నారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడి భార్య హిల్లరీ క్లింటన్‌తో రాజమౌళి భేటీ మరో ప్రత్యేకతను సంతరించుకుంది.
భారతీయ కథలపైనే నా ఫోకస్ : రాజమౌళి
'టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్'లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి పాల్గొన్నారు. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా తీస్తారా అని రాజమౌళిని వ్యాఖ్యాత ప్రశ్నించారు. రాజమౌళి తన సినిమాలపై పలు ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన సినిమా కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలిపారు.
హాలీవుడ్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ (RRR)
రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' పలు రికార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గుర్తింపు లభిస్తోంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టులలో ఉత్తమ చిత్రం కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' (RRR) రెండో స్థానంలో నిలిచింది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టుకు, ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా కూడా పోటీ పడలేదు. 'ఆర్ఆర్ఆర్' ఉత్తమ చిత్ర విభాగంలో మరో 9 హాలీవుడ్ చిత్రాలతో పోటీపడడం గమనార్హం. 'ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీసును షేక్ చేసింది. దాదాపు రూ.12 వందల కోట్లను కొల్లగొట్టి ఇండియన్ సినిమా రికార్డులను తిరగ రాసింది.
Read More: RRR: ఎన్టీఆర్ (NTR) పులిని ఎలా బంధించాడో తెలుసా!..మరోసారి తన ధీరత్వం చూపిన రాజమౌళి
Follow Us