ప్ర‌పంచ సినీ వేడుక‌ల‌కు 'రాజ‌మౌళి' (SS Rajamouli).. అమెరికా మాజీ అధ్య‌క్షుడి భార్య‌తో భేటీ !

టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ కు రాజ‌మౌళి (SS Rajamouli) కి ఆహ్వానం అందింది. ఈ వేడుక‌లు సెప్టెంబర్‌ 8 నుంచి 18 వరకు జ‌ర‌గ‌నున్నాయి.

Toronto International Film Festival 2022: టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి (SS Rajamouli) 'ఆర్.ఆర్.ఆర్' సినిమా త‌ర్వాత మరింత పాపుల‌ర్ అయ్యారు. తెలుగు సినిమాను ప్ర‌పంచ స్థాయిలో నిల‌బెట్టిన వ్య‌క్తి రాజమౌళి. ప‌లువురు హాలీవుడ్  సినీ ప్ర‌ముఖులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.  హాలీవుడ్ నుంచి రాజ‌మౌళికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్ర‌పంచ స్థాయిలో జ‌రిగే సినీ వేడుక‌ల‌కు రాజ‌మౌళికి ఆహ్వానం పంపారు. హాలీవుడ్ స్థాయిలో జ‌రిగే సినీ వేడుక‌లకు హాజ‌ర‌వుతున్న తెలుగు దర్శకుడిగా రాజ‌మౌళి చ‌రిత్రకెక్కారు.

'టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్'లో పాల్గొనేందుకు రాజ‌మౌళి (SS Rajamouli) కి ఆహ్వానం అందింది. ఈ సినిమా వేడుక‌లు సెప్టెంబర్‌ 8 నుంచి సెప్టెంబర్‌ 18 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఈ వేడుకలలో హాలీవుడ్ ప్ర‌ముఖ‌ల‌తో క‌లిసి రాజ‌మౌళి సంద‌డి చేయ‌నున్నారు. ఈ సందర్భంగా, అమెరికా మాజీ అధ్య‌క్షుడి భార్య‌ హిల్ల‌రీ క్లింట‌న్‌ను రాజ‌మౌళి క‌ల‌వ‌నున్నారు. ఈ ఫెస్టివల్‌లో 'ఆర్,ఆర్.ఆర్' సినిమాను కూడా ప్రదర్శించ‌నున్నారు.

హాలీవుడ్ అవార్డు పొందిన ఆర్ఆర్ఆర్ (RRR)

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ న‌టించిన 'ఆర్ఆర్ఆర్' ప‌లు రికార్డులను సొంతం చేసుకుంది. ప్ర‌పంచ స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' సినిమాకు గుర్తింపు ల‌భిస్తోంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టుల‌లో ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆర్ఆర్ఆర్ (RRR) రెండో స్థానంలో నిలిచింది. 

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్టుకు, ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఇండియ‌న్ సినిమా కూడా పోటీ ప‌డ‌లేదు. 'ఆర్ఆర్ఆర్' ఉత్త‌మ చిత్ర విభాగంలో మ‌రో 9 హాలీవుడ్ చిత్రాల‌తో పోటీప‌డడం గమనార్హం. ఉత్త‌మ చిత్రంగా తమ సినిమానే ఈ పోటీలో విజ‌యం సాధిస్తుంద‌ని 'ఆర్ఆర్ఆర్' చిత్ర యూనిట్ బలంగా నమ్మింది. అయినప్పటికీ, రెండో స్థానంలో నిలిచి ఆర్.ఆర్.ఆర్ తెలుగు సినిమా స‌త్తాను ప్ర‌పంచానికి తెలిసేలా చేసింది. 

'ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీసును షేక్ చేసింది. దాదాపు రూ.12 వంద‌ల‌ కోట్లను కొల్లగొట్టి ఇండియ‌న్ సినిమా రికార్డుల‌ను తిర‌గ రాసింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, శ్రియా శరన్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య ఆర్‌.ఆర్.ఆర్ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణీ ఈ చిత్రానికి సంగీతం అందించారు.  

Read More: RRR: 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి గ‌ర్వ‌ప‌డుతుంది'... ఇజ్రాయెల్ ప‌త్రిక‌ల్లో ఎన్టీఆర్( NTR) క‌థ‌నాలు

Credits: Twitter
You May Also Like These