టాలీవుడ్ నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) ఓ కేసు విషయమై చిత్తూరు జిల్లాలోని నగరి కోర్టుకు హాజరయ్యారు. జీవిత, రాజశేఖర్ దంపతులు గరుడవేగ సినిమా కోసం తమ దగ్గర అప్పు తీసుకుని చెల్లించలేదంటూ జోస్టర్ గ్రూప్ యాజమాన్యం గత కొన్ని రోజుల నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. తమ దగ్గర తీసుకున్న నగదు చెల్లించలేదంటూ జోస్టర్ గ్రూప్ యాజమాన్యం కోర్టుకెక్కింది. దీంతో కోర్టు జీవితా రాజశేఖర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
చెక్ బౌన్స్ కేసు
గరుడవేగ సినిమా కోసం జీవితా రాజశేఖర్ (Jeevitha Rajasekhar) ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయిందని జోస్టర్ గ్రూప్ యాజమాన్యం నగరి కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు జీవితా రాజశేఖర్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో జీవితా రాజశేఖర్ కోర్టుకు వెళ్లారు. తన న్యాయవాదులతో కలిసి కోర్టుకు వెళ్లిన జీవిత తన సమస్యను కోర్టులో వెల్లడించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని తమపై వచ్చిన ఆరోపణలపై జీవితా రాజశేఖర్ తెలిపారు. కొందరు వ్యక్తుల వల్ల తమ మేనేజర్లు ఇబ్బంది పడ్డారన్నారు.
Follow Us