Liger: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించిన 'లైగర్' సినిమా భారీ అంచనాలతో విడుదల కానుంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లైగర్' సినిమా ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రీసెంట్‌గా జరిగిన ప్రెస్‌మీట్‌లో విజయ్ దేవరకొండ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. 'లైగర్' కోసం తాను మూడేళ్లు శ్రమించానన్నారు రౌడీ హీరో. అంతేకాదు తన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూపించాలా అనే ఆతృతతో ఉన్నానని తెలిపారు.
సినిమా హిట్ అవుతుంది - విజయ్ దేవరకొండ
పాన్ ఇండియా సినిమాగా 'లైగర్' తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్లను కూడా ఇండియా లెవల్‌లో ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా జరిగిన ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తన మనసులో మాట తెలిపారు. మూడేళ్ల నుంచి 'లైగర్' కోసం వర్క్ చేస్తున్నానని.. కోవిడ్ వల్ల తనకు ఇంత టైం పట్టిందన్నారు. ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలనే ఆతృతతో ఉన్నానన్నారు.
'లైగర్' సినిమాను చూసి ప్రతీ ఒక్కరు ఎంజాయ్ చేస్తారన్నారు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బాస్టర్ హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. అయితే విడుదల తరువాత ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలన్నారు విజయ్.
కరణ్ సపోర్ట్ మరిచిపోలేం - రౌడీ హీరో
తెలుగు రాష్ట్రాల్లో 'లైగర్' సినిమా బుకింగ్స్ ఓపెన్ చేశామని విజయ్ తెలిపారు. మరో నాలుగు రోజుల్లో 'లైగర్' థియేటర్లలోకి వచ్చేస్తుందన్నారు. తమ సినిమాను బాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లేందుకు కరణ్ జోహార్ తప్ప తమకు ఇంకెవరూ కనిపించలేదన్నారు. 'లైగర్' 2019లో మొదలైందని.. అప్పుడు 'బాయ్ కాట్ బాలీవుడ్' లాంటి ట్రేండ్ లేదని స్పష్టం చేశారు. కరణ్ 'బాహుబలి' చిత్రాన్ని ఇండియా మొత్తం విస్తరించారు. నార్త్‌లో కరణ్ తమకు కొత్త దారిని చూపించారన్నారు. కరణ్ వల్లే నార్త్‌లో 'లైగర్' సినిమాకు హైప్ క్రియేట్ అయిందన్నారు.
ప్రేక్షకుల మద్దతు ఉంది - విజయ్
'బాయ్ కాట్ బాలీవుడ్' గొడవలేంటో అర్థం కావడం లేదని విజయ్ (Vijay Devarakonda) అన్నారు. తాను ఇండియాలోనే పుట్టానని.. హైదరాబాదీనని.. ఛార్మి పంజాబీ, పూరీ నర్సీపట్నంలో పుట్టారని విజయ్ చెప్పుకొచ్చారు.
తాము ఏ నగరానికి వెళ్లినా ప్రజలు తమకు ఎంతో అభిమానాన్ని పంచుతున్నారని రౌడీ హీరో తెలిపారు. ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తున్నాము.. వాళ్లు ఉన్నంత వరకు తమకు ఎలాంటి భయం లేదన్నారు విజయ్.
Follow Us