Advertisement

Aditi rao Hydari: ఆకట్టుకునే అందంతో ఆహా అనిపిస్తున్న అదితి రావు హైద‌రి..!

చూడ‌చ‌క్క‌ని అందంతో ఆక‌ట్టుకునే అందాల ముద్దుగుమ్మ అదితి రావు హైద‌రి (Aditi rao Hydari). బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించిన అదితి రావు హైదరి 'సమ్మోహనం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 'అంతరిక్షం', 'వి' లాంటి చిత్రాలలో నటించి మెప్పించింది. 

అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన  'మహాసముద్రం' (Mahasamudram Movie) సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ అదితి నటకు ఫిదా అయ్యారు సినీ ప్రియులు. అందుకే ఈ అమ్మడికి మంచి అవకాశాలే వస్తున్నాయి. కాగా, ఈ బ్యూటీ నటించిన 'హే సినామిక' ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. 

కాగా, అదితిరావు హైదరి తెలుగు సినిమాల్లో సరైన కమ్ బ్యాక్ తో మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలోచాలా యాక్టివ్‌గా ఉంటూ అందాల వ‌ల విసురుతోంది. అందుకే ఆమె ఏ పోస్ట్ చేసిన కూడా అది కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతోంది. కాగా, అదితి రావు హైదరి ఇటీవల ప్రతిష్టాత్మకమైన కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2022లో (Cane's Film FestivaL) తళుక్కుమంది. 

ఇందులో బాలీవుడ్‌ స్టార్స్‌ ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, నవాజుద్ధీన్‌ సిద్ధిఖీ, ఆర్ మాధవన్‌, (Pooja Hegde) పూజా హెగ్డేతోపాటు అదితి పాల్గొంది. వేడుకలో భాగంగా ఈ బ్యూటీ రెడ్‌ కార్పెట్‌పై రెడ్‌ అండ్‌ పింక్‌ గౌన్‌లో అందంగా నడిచి ఆకట్టుకుంది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అదితి రావు హైదరి.

Read More: Aditi-Rakul: హైదరాబాద్ లో Et Excellence Awards కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు తారలు రకుల్, అదితి..!

Advertisement
You May Also Like These
Advertisement