టాలీవుడ్ హీరో రామ్ పోతినేని (Ram pothineni) నటించిన పవర్‌ఫుల్ యాక్షన్ సినిమా 'ది వారియర్'. ఈ సినిమాతో రామ్ తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు. 'ది వారియర్' సినిమా తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న రిలీజ్ అయింది. ఈ సినిమా విడుదలై 11 రోజులు కావస్తున్నా.. వసూళ్ల పరంగా స్లోగానే ఉంది. 'ఇస్మార్ట్ శంకర్'తో రామ్ ఓ రేంజ్‌లో సక్సెస్ అందుకున్నారు. కానీ 'ది వారియర్' సినిమా మాత్రం రామ్‌ను నిరాశ పరిచింది.
కలెక్షన్‌లో 'ది వారియర్' వీక్
తమిళ దర్శకుడు లింగుసామితో దర్శకత్వంలో తెరకెక్కిన 'ది వారియర్' చిత్రంలో రామ్ పోతినేని (Ram pothineni) మొదటి సారి పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఈ సినిమాలో రామ్‌కు జోడిగా 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి నటించారు. ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 'ది వారియర్' సినిమా రిలీజ్‌కు ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ రిలీజ్ తర్వాత అనుకున్నంత కలెక్షన్ రాబట్టలేకపోయింది.
డిస్టిబ్యూటర్‌గా రామ్ (Ram pothineni)
'ది వారియర్' సినిమాతో రామ్ పోతినేని డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. వైజాగ్ ఏరియాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ హక్కులను రామ్ సొంతం చేసుకున్నారు. దాదాపు రూ. 4.5 కోట్ల రూపాయలతో రామ్ ఈ సినిమాను కొనుగోలు చేశారట.
ది వారియర్ 11 రోజుల వసూళ్లు
- తెలుగు రాష్ట్రాల్లో - రూ. 17.63 కోట్లు
- తమిళ నాడులో - రూ. 1.32 కోట్లు
- మిగతా రాష్ట్రాల్లో - రూ. 1.10 కోట్లు
- ఓవర్సీస్ - రూ. 68 లక్షలు
- ప్రపంచ వ్యాప్త వసూళ్లు - రూ. 20.73 కోట్లు (షేర్), రూ. 35.45 కోట్లు (గ్రాస్)
రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా నటించిన 'ది వారియర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.10 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 39 కోట్లుగా నమోదైంది. 'ది వారియర్' చిత్రం 11 రోజుల్లో రూ. 20.73 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం మరో రూ. 18.27 కోట్లు వసూలు చేస్తేగానీ హిట్ అనుపించుకోదు.
Read More : Ram pothineni: రామ్ పోతినేని నటించిన 'ది వారియర్' ప్రత్యేకతలు ఇవే! ఈ సినిమా టాప్ 10 విశేషాలు మీకోసం !
Follow Us