టాలీవుడ్‌లో అనుష్క శెట్టి (Anushka Shetty) నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. యోగా ట్రైనర్‌గా కెరీర్ మొదలు పెట్టిన అనుష్క శెట్టి అనుకోకుండా చిత్ర రంగంలోకి ప్రవేశించారు. కమర్షియల్ చిత్రాలే కాకుండా అరుంధతి లాంటి లేడీ ఒరియెంట్ చిత్రాలలో నటించి తన నటనకున్న పవర్ ఏంటో చూపించారు.
అక్కినేని నాగార్జున నటించిన సూపర్ సినిమాతో అనుష్క శెట్టి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అనుష్క శెట్టి.. అగ్ర కథానాయకురాలిగా కొనసాగుతున్నారు. బాహుబలి, అరుంధతి వంటి సినిమాలతో మరింత పాపులర్ అయ్యారు.
హీరోయిన్‌గా మారిన యోగా ట్రైనర్
బెంగుళూరుకు చెందిన అనూష్క శెట్టి యోగా ట్రైనర్‌గా పనిచేశారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు యోగాలో శిక్షణ ఇస్తుండేవారు. అనుష్క శెట్టి యోగా గురువు ప్రముఖ నటి భూమిక చావ్లా భర్త భరత్ ఠాకూర్. నాగార్జున అనుష్కను సినీ రంగానికి పరిచయం చేశారు. అనుష్క శెట్టి అసలు పేరు స్వీటీ శెట్టి.
సూపర్ తర్వాత అనుష్క శెట్టి (Anushka Shetty) మహానంది, విక్రమార్కుడు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తరువాత వరుస మూవీ ఆఫర్లతో టాప్ హీరోయిన్ స్థానం సంపాదించారు.
లక్ష్యం, డాన్, స్టాలిన్, చింతకాయల రవి, బిల్లా, కింగ్, మిర్చి, బాహుబలి, సింగం 3, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టాలిన్‌లో చిరంజీవితో కలిసి అనుష్క స్పెషల్ సాంగ్‌లో నటించారు,
అరుంధతి అనుష్క
అనుష్క శెట్టి కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటించారు. అరుంధతి, పంచాక్షరి, వర్ణ, నాగవల్లి, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలతో అనుష్క స్టార్ డమ్ మరింత పెరిగింది.
అరుంధతి సినిమాలో నటించిన అనుష్కకు నంది అవార్డుతో పాటు ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డు కూడా లభించింది. నాగవల్లి సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. వేదం లాంటి విభిన్న పాత్రల్లో నటించిన అనుష్క.. ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డును పొందారు.
స్వీటీది మంచి మనసు
అనుష్క శెట్టి (Anushka Shetty) మంచి మనసున్న నటి. ఓ సారి షూటింగ్ కోసం తమిళనాడు వెళ్లిన అనుష్క తన కారు డ్రైవర్ కష్టాలను తీర్చి గొప్ప మనసును చాటుకున్నారు. తన షూటింగ్ కోసం సదరు చిత్ర యూనిట్ ఓ కారును ఏర్పాటు చేశారట. వారం గడిచిన తర్వాత డబ్బులు కట్టకపోవడంతో ఆ కారును ఫైనాన్స్ సంస్థ తీసుకెళ్లిందట. ఆ విషయం తెలుసుకున్న అనుష్క.. వెంటనే కారు డ్రైవర్‌ను పిలిపించి.. ఫైనాన్స్ సంస్థ దగ్గరకు వెళ్లారట. అనుష్క తన డబ్బును కట్టి ఆ కారును డ్రైవర్‌కు ఇప్పించారట. మానవత్వంతో స్వీటీ ఆ కారు డ్రైవర్‌కు సహాయం చేశారు.
అనుష్క శెట్టి (Anushka Shetty) తెలుగు, తమిళ చిత్రాలలో నటించారు. యూవీ క్రియేషన్ బ్యానర్‌లో అనుష్క శెట్టి ఓ చిత్రంలో నటించనున్నారు. 40 ఏళ్ల అనుష్క శెట్టి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తయింది. ఇకపై ఎలాంటి సినిమాలతో అనుష్క శెట్టి ప్రేక్షకులకు వినోదం పంచనున్నారో వేచి చూడాలి.
Read More: Prabhas-Anushka: మరోసారి జంటగా ఓ సినిమా చేయబోతున్న ప్రభాస్-అనుష్క.. దర్శకుడు ఎవరంటే?
Follow Us