భవిష్యత్తులో తెలుగు సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తానని చెప్తోంది శోభిత ధూళిపాళ. ‘గూఢచారి’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ తెలుగు సోయగం ప్రస్తుతం దక్షిణాదిన బిజీ తారగా మారింది. అడివి శేష్ (Adivi Sesh), శోభిత హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మేజర్’. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ సినిమా 26/11 దాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.
‘‘గూఢచారి’ షూటింగ్ సమయంలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం గురించి దర్శకుడు శశికిరణ్ నాతో చాలా విషయాల్ని పంచుకునేవారు. ఈ కథకు నేనే తొలి ప్రేక్షకురాలిని. సినిమాలో ఆనాటి దాడి ఘటనలో బందీ అయిన ప్రమోద అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. ఆశనిరాశల మధ్య ఊగిసలాడుతూ భిన్న భావోద్వేగాలతో నా పాత్ర సాగుతుంది’ హీరోయిన్ శోభిత ధూళిపాళ చెప్పింది.
కెరీర్‌లో ఇప్పటి వరకు ఈ స్థాయి ఎమోషనల్ క్యారెక్టర్ చేయలేదు. అడివి శేష్‌తో నటించిన రెండో చిత్రమిది. ఆయనకు నేను లక్కీ ఛార్మ్ అంటున్నారు. కన్నీళ్లు రావడానికి గ్లిజరిన్ వాడలేదు. ఈ కథలోని ఉద్వేగాల్ని అనుభవించిన తర్వాత సినిమా కోసం ఎప్పుడూ గ్లిజరిన్ వాడే అవసరం రాదని అనిపించింది’ అని పేర్కొంది.
ఈ సినిమాను మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించింది. మే 9న మేజర్ ట్రైలర్ రిలీజై మంచి రెస్పాన్స్ రాబట్టింది.
మేజర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అడివి శేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని అమెరికాలో ఉన్నప్పుడు అందరూ సన్నీలియోన్ అని ఏడిపిస్తుండడంతో అడివి శేష్‌గా మార్చుకున్నాను అని చెప్పాడు. అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు అడివి శేష్ స్పందిస్తూ.. 'అక్కడ భారతీయులకు టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి.. ఇలాంటి పాత్రలే ఇచ్చేవారు. అక్కడ ఇండియన్ హీరో కాలేడు. ఇప్పుడు కూడా హాలీవుడ్‌లో బాగా పాపులర్ అయిన ఇండియన్స్ కమెడియన్ రోల్స్‌లోనే కనిపిస్తారని అన్నాడు అడివి శేష్ (Adivi Sesh).
Follow Us