The Warrior: త‌మిళ‌నాడులో రామ్ దూకుడు ! 'ది వారియ‌ర్' ప్రీ రిలీజ్ వేడుక‌కు 28 కోలీవుడ్ సెల‌బ్రిటీలు!

The Warrior: రామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం 28 మంది త‌మిళ సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

The Warrior: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) మొద‌టి సారి త‌మిళ్‌లో త‌న స‌త్తా చాటేందుకు రెడీ అయ్యారు. 'ది వారియ‌ర్' సినిమాను తెలుగుతో పాటు త‌మిళ్‌లోనూ నిర్మించారు. త‌మిళ్‌లో మాస్ యాక్షన్ సినిమాలను తెర‌కెక్కించ‌డంలో లింగు సామికి మంచి గుర్తింపు ఉంది. లింగు సామి ద‌ర్శ‌క‌త్వంలో 'ది వారియ‌ర్' సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో రామ్‌కు జోడిగా కృతి శెట్టి న‌టించారు. 

'ది వారియ‌ర్' సినిమా త‌మిళ వ‌ర్ష‌న్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వ‌హిస్తున్నారు. ఈ ఈవెంట్ జూలై 6 సాయంత్రం జ‌రుగ‌నుంది. 'సత్య సినిమాస్‌'లో జ‌రుగనున్న ఈ కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం, దాదాపు 28 మంది త‌మిళ సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారట. ఈ క్రమంలో ఎవ‌రెవ‌రు ఈ వేడుకకు హాజ‌ర‌వుతారనే విష‌యాల‌తో చిత్ర యూనిట్ ప్ర‌త్యేకంగా ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది. 

కోలీవుడ్‌లో స‌త్తా చాటనున్న రామ్
The Warrior: రామ్ (Ram Pothineni) కొత్త సినిమా ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మానికి  స్టార్ హీరో హీరోయిన్లు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, బ‌డా నిర్మాత‌లు హాజ‌రుకానున్నారు. వాళ్ల పేర్ల‌ను ప్ర‌క‌టిస్తూ 'ది వారియ‌ర్' టీమ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసింది. త‌మిళ‌నాడులో త‌న ఫాలోయింగ్ పెంచుకోవాల‌ని రామ్ ప్ర‌య‌త్నిస్తున్నారు. కోలీవుడ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండాల‌ని రామ్ భావించ‌డంతో.. చిత్ర యూనిట్ ప్ర‌త్యేకంగా ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది.

భార‌తీరాజా, ప్ర‌భు, విశాల్, లోకేష్ క‌న‌గ‌రాజ్, కార్తీ, విక్ర‌మ‌న్, ఎస్‌జే సూర్య‌, కీర్తి సురేష్, ఆర్కే సెల్వ‌మ‌ణి, శంక‌ర్, ప‌న్నీర్ సెల్వం వంటి ప్ర‌ముఖులు ఈ కార్యక్రమానికి హాజ‌రుకానున్నారు. రామ్ ఇప్ప‌టికే చెన్నైకు చేరుకున్నారు. ప్రస్తుతం రామ్‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

The Warrior: 'ది వారియ‌ర్' సినిమాలో రామ్ ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ 'సత్య' పాత్రలో నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో ఈ సినిమా తెర‌కెక్కింది. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి 'ది వారియ‌ర్' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Read More: Ram Pothineni: ప్రేమ, పెళ్లి వార్తలపై రామ్‌ పోతినేని షాకింగ్ కామెంట్స్.. ట్వీట్‌ వైరల్

You May Also Like These