హీరో రామ్ పోతినేని(Ram Pothineni) పోలీస్ ఆఫీసర్‌గా ది వారియర్ సినిమాలో నటిస్తున్నారు. ది వారియర్ సినిమా మొదటి పాట రిలీజ్ ఈవెంట్‌కు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) గెస్ట్‌గా వచ్చారు. లింగుస్వామి ఈ సినిమా సీన్స్ చాలా ఢిఫెరెంట్‌గా ప్లాన్ చేశారట.
తెలుగు, తమిళ్ భాషల్లోనూ ది వారియర్ సినిమా చేస్తున్నారు. రామ్ పోతినేని(Ram Pothineni)తో జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటిస్తున్నారు. ది వారియర్ మొదటి పాటను చెన్నైలో విడుదల చేశారు. బుల్లెట్ అంటూ సాగే ఈ పాట లాంచ్ చేసేందుకు తమిళ హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఓ సాంగ్ ఇంత గ్రాండ్‌గా లాంచ్ చేయడం ఎప్పుడూ చూడలేదని ఉదయనిది అన్నారు. పాట చాలా బాగుందని.. రామ్‌తో పెద్దగా పరిచయం లేకపోయిన.. కలిసిన 5 నిమిషాల్లో మంచి దోస్త్ అయ్యాడన్నారు..
దర్శకుడు లింగుస్వామి రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా ఆడియో ఫంక్షన్‌కు రమ్మని పిలిచారని ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చెప్పారు. ఇదివరకే బుల్లెట్ పాట రిలీజ్ చేయాలకున్నారని.. తాను బిజీగా ఉండటం వల్ల ఇప్పుడు రిలీజ్ చేశారన్నారు. ది వారియర్ సినిమా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నట్లు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) అన్నారు. రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన బుల్లెట్ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. ఈ పాటను తమిళ్ హీరో శింబు పాడారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ఉదయనిధి స్టాలిన్ బులెట్ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కు రావడం సంతోషంగా ఉందని హీరో రామ్ పోతినేని(Ram Pothineni) అన్నారు. ది వారియర్ సినిమా కథ విన్నప్పుడే ఆది పినిశెట్టి నట్టిస్తున్నట్లు కూడా దర్శకుడు చెప్పారన్నారు రామ్. లింగు స్వామి ప్రతీ సీన్ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశారని రామ్ అన్నారు. తాను పుట్టింది చెన్నైలో అని.. మొదటి సినిమా తమిళ్‌లో చేయాలనుకున్నా కొన్ని కారణాలతో కుదరలేదని రామ్ పోతినేని(Ram Pothineni) చెప్పారు. ఇనాళ్లకు తమిళ్‌లోనూ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
Follow Us