Liger: ప్రపంచ కిక్ బాక్సింగ్ చరిత్రలో మైక్ టైసన్ (Mike Tyson)కు ప్రత్యేక స్థానం ఉంది. మైక్ టైసన్ మొదటి సారి 'లైగర్' సినిమాతో చిత్ర రంగానికి ఎంట్రీ ఇచ్చారు. అయితే 'లైగర్' సినిమాలో మైక్ టైసన్ పాత్రను దర్శకుడు పూరీ జగన్నాథ్ సరిగ్గా తెరకెక్కించలేదని ప్రేక్షకులు అంటున్నారు.
అనవసరంగా మైక్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నారంటున్నారు. లెజండరీ బాక్సర్‌కు కామెడీ రోల్ ఇచ్చారని మండిపడుతున్నారు. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్‌ల మధ్య సీన్లు సరిగ్గా చిత్రీకరించలేదని అభిప్రాయపడుతున్నారు.
పేలని ఫైటర్ డైలాగులు
‘ఇఫ్ యు ఆర్ ఎ ఫైటర్.. దెన్ హు యామ్ ఐ’ అంటూ 'లైగర్'లో మైక్ టైసన్ (Mike Tyson) డైలాగులు థియేటర్లలో అంతగా పేలలేదు. ఫైటర్‌ను కమెడియన్‌గా చూపించారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
పోస్టర్లలో చూసి మైక్ టైసన్‌కు, విజయ్‌కు మధ్య ఉండే సీన్లు అదిరిపోతాయనుకుంటే.. పూరీ నిరాశపరిచారంటున్నారు. ఫైటర్ మైక్ టైసన్ వల్లే 'లైగర్' (Liger) సినిమాకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తెరపై చూస్తే ఆ లెజండరీ బాక్సర్ సీన్లు అంతగా అలరించలేదు.
కమెడియన్ పాత్రలో మైక్?
హీరోయిన్‌ను కిడ్నాప్ చేసే పాత్రలో మైక్ (Mike Tyson) నటించారు. కిడ్నాప్‌తో డబ్బులు డిమాండ్ చేసే పాత్రలో.. పూరీ జగన్నాథ్ మైక్ టైసన్‌ను చూపించారు. మైక్ చేసిన పాత్రకి టాలీవుడ్ కమెడియన్లు కూడా సరిపోతారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
కామెడీ పాత్రలో నటించడానికి మైక్‌ను ఎందుకు తీసుకొచ్చారని, పూరీ జగన్నాథ్‌ను ప్రశ్నిస్తున్నారు జనాలు. మైక్ టైసన్ పాత్ర బాక్సింగ్‌తో ముడిపడి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేదంటున్నారు.
Follow Us