స్టార్ డైరెక్టర్ పేరు రావాలంటే ఏళ్ల తరబడి సినిమాలు చేయాలి. అది పాత స్టోరీ. ఒక్క సినిమాతోనే దమ్మున్న దర్శకుడిగా మారొచ్చని కొందరు ప్రూవ్ చేశారు. ధియేటర్లను దడ పుట్టిస్తున్న డైరెక్షన్ కథ తెలుసుకుందాం.
ప్రశాంత్ నీల్
ప్రపంచం తన వైపు చూసేలా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ అనే టైటిల్‌తో ఏకంగా రెండు సినిమాలు చేసి సూపర్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. దేశంలోనే టాప్ 4 డైరక్టర్ల జాబితాలో నిలిచారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 సృష్టిస్తున్న సంచనాలతో త్వరలో అందరూ ఇతనిని కేజీఎఫ్ ప్రశాంత్ అంటారేమో.
నాగ్ అశ్విన్
‘మహానటి’ సినిమా నాగ్ అశ్విన్ తప్ప మరెవరూ తెరకెక్కించలేరేమో అన్నట్లు దర్శకత్వం వహించారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయేలా చేయగలిగారు. అందుకే ఆ సినిమా ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచింది. దీంతో బెస్ట్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
సందీప్ రెడ్డి వంగా
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యారు సందీప్ రెడ్డి. బాలీవుడ్, టాలీవుడ్ ఆఫర్లతో ప్రస్తుతం చెలరేగిపోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా సందీప్ రెడ్డిని హై రేంజ్‌లో నిలబెట్టింది.
ఓం రౌత్
ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో సౌత్‌లో పాపులర్ అయ్యారు ఓం రౌత్. తానాజీ సినిమా ఓం రౌత్ చేసిన మొదటి సినిమా. ఈ సినిమా వంద కోట్లు కొల్లగొట్టింది. స్టార్ డమ్ ఓం రౌత్ సొంతం అయింది. ఆదిపురుష్‌తో ఓం రౌత్ వందల కోట్ల మార్కెట్ సృష్టిస్తారని టాక్.
Follow Us