టాలీవుడ్‌తో కనెక్ట్‌ కాలేకపోయా.. నెపోటిజంపై సంచలన కామెంట్స్ చేసిన అమలాపాల్ (Amala Paul)

రాంచరణ్‌ సరసన నాయక్‌, నాగచైతన్యతో బెజవాడ సినిమాలు చేశారు హీరోయిన్‌ అమలాపాల్ (Amala Paul)

కెరీర్ ప్రారంభంలో మెగా పవర్‌‌స్టార్‌‌ రాంచ‌ర‌ణ్‌, నాగ‌చైత‌న్య వంటి స్టార్ కిడ్స్‌తో నటించారు మలయాళీ భామ అమలాపాల్ (Amala Paul). టాలీవుడ్‌లో చాలా తక్కువ సినిమాలు చేసినా, తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరయ్యారు. తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. అయితే, ఇటీవలే తెలుగు ఫిలిం ఇండస్ట్రీతో కనెక్ట్‌ కాలేకపోయానని సంచలన కామెంట్లు చేశారు అమలాపాల్.

ఇటీవలే సోషల్‌ మీడియాలో జరిగిన చిట్‌చాట్‌లో అమలాపాల్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. ఈ సెషన్‌లో టాలీవుడ్‌లో నెపోటిజం అంశాన్ని కూడా ప్రస్తావించారు.

‘తెలుగు ఇండ‌స్ట్రీకి వెళ్లిన‌పుడు అక్కడ ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంద‌ని తెలుసుకున్నాను. అక్కడ వారి కుటుంబాలు, వారి అభిమానుల ఆధిప‌త్యం ఎక్కువ‌. ఆ స‌మ‌యంలో వాళ్లు తీసే సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉండేవి. అంతేకాదు సినిమాలో ఎప్పుడూ ఇద్దరు హీరోయిన్లు ఉండాల్సిందే. ప్రేమ స‌న్నివేశాలు, పాట‌లు.. ఇలా ప్రతి ఒక్క సీన్‌లో చాలా గ్లామ‌ర‌స్‌గా కనిపించడానికి మేము అక్కడ ఉండాల్సి వచ్చేది.

తమిళంలో ఎంట్రీ ఇవ్వడం నా అదృష్టం

టాలీవుడ్‌లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలదే హవా. అందుకే తెలుగు ఇండ‌స్ట్రీతో ఎక్కువగా క‌నెక్ట్ కాలేకపోయాను. ఇందువల్లే, టాలీవుడ్‌లో కొన్ని సినిమాలే చేశాను. ఇక నా అదృష్టం కొద్దీ తమిళ సినిమాతోనే, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను.నేను వ‌చ్చిన‌ సమయంలోనే, దర్శకనిర్మాతలు కొత్త వాళ్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. నేను కూడా బాగా నటించగలనని నిరూపించుకోగలిగాను. ఇక, త్వరలోనే ఎ – లిస్ట్‌లో ఉన్న నటీనటులతో పనిచేస్తాను’ అని చెప్పుకొచ్చారు అమ‌లాపాల్‌ (Amala Paul). ఇటీవలే అక్కినేని నాగచైతన్య కూడా నెపోటిజంపై కామెంట్లు చేశారు.

Read More : Naga Chaitanya: నెపోటిజంపై నాగచైతన్య సంచలన వ్యాఖ్యలు.. ఇంతకీ ఏమన్నాడంటే?

You May Also Like These