సీనియర్ హీరో రాజశేఖర్, జీవితల పెద్ద కూతరు శివాని రాజశేఖర్ (Shivani Rajashekar) తన అందంతో, నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతోంది. హీరోయిన్‌గా నటిస్తూనే, మోడల్‌గా మిస్ ఇండియా పోటీల్లో ప్రతిభ కనబరుస్తోంది, ఇటీవల జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీల్లో శివాని పాల్గొంది. ఏప్రిల్ 30న జరిగిన ఈ పోటీల్లో మిస్ తమిళనాడుగా ఎంపికైంది శివాని. దీంతో శివానిపై పలువురు విమర్శలు చేస్తున్నారు. తెలుగ అమ్మాయి అయ్యుండి తమిళనాడు రాష్ట్రం నుంచి ఎందుకు మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాలని ప్రశ్నిస్తున్నారు.
కాగా, తండ్రి రాజశేఖర్‌తో కలిసి శేఖర్ అనే సినిమాలో నటించింది శివాని. ఆ సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. మిస్ ఇండియా పోటీలకు తమిళనాడు నుంచి రిప్రజెంట్ చేయడంపై శివాని స్పందించింది.
తెలంగాణలో ఉంటున్న నేను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని అనుకున్నాను. మిస్ ఇండియా నిర్వాహకులు మాత్రం అప్లికేషన్‌లో మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చారు. తమిళనాడు రాష్ట్రాన్ని కూడా ఒక ఆప్షన్‌గా ఎంపిక చేసుకున్నాను. నేను పుట్టింది చెన్నైలో గనుక ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు ఆప్షన్ కూడా ఇచ్చాను.
అయితే, నిర్వాహకులు మాత్రం నన్ను తమిళనాడు కేటగిరీలో ఎంపిక చేశారు. అందుకే మిస్ ఇండియా తమిళనాడు’గా ఎంపికయ్యాను. ఏపీ, తెలంగాణ నుంచి నన్ను ఎంపిక చేసి ఉంటే ఒక తెలుగమ్మాయిగా మరింత సంతోష పడే దానిని. తమిళనాడు కూడా నా సొంత రాష్ట్రం వంటిదే. వీటన్నింటికంటే నేను భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నందుకు గర్వపడుతున్నాను అని చెప్పింది శివాని (Shivani Rajashekar)
Follow Us