అభిమానుల‌కు లేఖ రాసిన (Mahesh Babu) మహేష్ బాబు .. అందులో ఏముందంటే?

మహేష్ బాబు (Super star Mahesh Babu)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12 ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. పరుశురాం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి, శంకర్, ఆచంట రామ్, ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ కి భారీ స్పందన లభిస్తోంది. ఈ నేప‌థ్యంలో నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. 

ఇదిలా ఉంటే.. సినిమా విడుదలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో.. మహేష్ బాబు త‌న‌ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. దీంతో ఈ లేఖ ప్ర‌స్తుతం వైరల్ అవుతోంది. ఈ లేఖలో సర్కారు వారి పాట (Sarkaru Vari Paata) సినిమాతో పాటు, తన నెక్స్ట్ సినిమాకు సంబంధించిన‌ అప్డేట్ ను కూడా ఇచ్చారు. ఆ లేఖ‌లో.. ప్రియమైన అభిమాన మిత్రులకు అంటూ మొదలు పెట్టి.. సర్కారు వారిపాట సినిమాను చూసి.. ఎలా ఉందో చెప్పాలని కోరారు. ఇక‌, మహేశ్ ఆయ‌న‌ అభిమానులకు రాసిన బహిరంగ లేఖ ఇలా ఉంది. 

”ప్రముఖ యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ – జి.యమ్.బి. ఎంటర్ టైన్ మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై ఎర్నేని నవీస్ – యలమంచిలి రవి శంకర్ – ఆచంట రామ్ – ఆచంట గోపిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో సరేగమ కంపెనీ ద్వారా మార్కెట్ లో విడుదలై రేటింగ్ లో విశేష సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన ‘సర్కారు వారి పాట’ చిత్రం థియేటర్ల లోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు. మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై యస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించే సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ లో మొదలుకానుంది. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి- మహేష్ బాబు” ఈ లేఖలో పేర్కొన్నారు. 

కాగా, సూప‌ర్ స్టార్ ఇలా అభిమానులనుద్దేశించి లేఖ రాయడం ప‌ట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఇది మహేష్ బాబు త‌న సోష‌ల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కడా అధికారికంగా పోస్ట్ చేయకపోవడం, వేరే వాళ్ళు ఎవ‌రో పోస్ట్ చేయడంతో. ఈ మ్యాటర్ మహేష్ చెప్పినట్టు లేదని.. ఇది ఫ్యాన్ మేడ్ లెటర్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం మహేష్ బాబు (Mahesh Babu) సినిమాకు శుభవార్త చెప్పింది. టికెట్ ధరపై రూ.45 పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. సినిమా విడుదలైన 10 రోజులవరకూ పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది.

You May Also Like These