నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు సునీల్ (Sunil). ఇదే క్రమంలో టాప్ హీరోలతో కలిసి నటించారు. బెస్ట్ కమెడియన్‌గా అవార్డులూ అందుకున్నారు. అదే కమెడియన్‌గా ఛాలెంజింగ్ రోల్స్ కూడా చేశారు. ఎన్నో సినిమాల్లో, వెరైటీ పంచులతో కడుపుబ్బ నవ్వించారు. తెలుగులో దాదాపు 177 సినిమాల్లో సునీల్ (Sunil) కమెడియన్‌గా నటించారు.
నువ్వు నేను, ఆంధ్రుడు సినిమాల్లో నటించిన సునీల్‌కు బెస్ట్ కమెడియన్‌గా నంది అవార్డులు లభించాయి. ఆ తర్వాత, కామెడీ స్టార్ బ్రహ్మనందంతో పోటాపోటీగా సినిమాలు చేసే స్థాయికి సునీల్ ఎదిగారు. అంతేకాదు హీరోగా కూడా సినిమాలు చేశారు. సుందర పురుషన్ అనే తమిళ చిత్రాన్ని అందాల రాముడిగా రీమేక్ చేశారు. అందాల రాముడు సినిమాలో హీరోగా చేసిన సునీల్, వెండితెరపై ప్రేక్షకులను మెప్పించాడు. ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు.
'అందాల రాముడు' సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో సునీల్.. 'మర్యాద రామన్న'లో హీరోగా నటించారు. మర్యాద రామన్న (Maryada Ramanna) లో చేసిన కామెడీకి సునీల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఇక ఈ రెండు సినిమాల తర్వాత, సునీల్ హీరోగా వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి. మిస్టర్ పెళ్లికొడుకు, కథ స్కీన్‌ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాలు డిజాస్టర్‌గా మిగిలాయి.
చాలా రోజుల తర్వాత సునీల్ వెండితెరపై డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించారు. కమెడియన్‌గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ రోల్స్ చేస్తూనే.. కలర్ ఫోటో, పుష్ఫ సినిమాల్లో సునీల్ విలన్ క్యారెక్టర్లు కూడా చేసి, తన టాలెంట్ బయటపెట్టారు. హీరో, కమెడియన్, క్యారెక్టర్ ఆరిస్టుగానే కాకుండా విలన్‌గా కూడా సునీల్ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాతో, మరో సారి కడుపుబ్బ నవ్వించేందుకు రెడీ అయ్యారు సునీల్. హీరోగా కూడా తాను నటించేందుకు సిద్ధమని సునీల్ అంటున్నారు. అయితే, హీరోగా సునీల్ (Sunil) ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచనున్నారో మనమూ వేచి చూడాలి.
Follow Us