పుష్ప- ది రూల్ (Pushpa The Rule) .. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి సూపర్ డూపర్ రోల్ !

Pushpa The Rule (పుష్ప ది రూల్) చిత్రంలో .. సునీల్ శెట్టి (Suniel Shetty) కి ప్రత్యేక పాత్ర

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేసిన విజువల్ మ్యాజిక్ ‘పుష్ప- ది రైజ్’. దక్షిణాది ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు కూడా ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. ఇదే క్రమంలో కలెక్షన్ల కుంభవర్షాన్ని కూడా కురిపించింది. ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.  ప్రస్తుతం బన్నీ ‘పుష్ప- ది రూల్’ చిత్రం కోసం చేస్తున్న కసరత్తు మామూలుగా లేదు.

ఇదే క్రమంలో ‘పుష్ప- ది రూల్’  (Puspa - The Rule) పై వచ్చిన ఓ తాజా న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమా కథను మలుపు తిప్పే, ఓ సీనియర్ పోలీస్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నటిస్తున్నాడని టాక్. అతనెవరో కాదు.. సునీల్ శెట్టి (Suniel Shetty) ఇప్పటికే ప్రథమార్థంలో ఫహాద్ ఫాజిల్ చేసిన పోలీస్ పాత్ర కథపై ఆసక్తి పెంచగా.. ద్వితీయార్థంలో మరిన్ని వైవిధ్యమైన పాత్రలను దర్శకుడు పరిచయం చేస్తున్నాడని వినికిడి.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి తెలుగు సినిమాలు కొత్తేమీ కాదు. గతంలో ఆయన మోసగాళ్లు, గని లాంటి తెలుగు చిత్రాలలో నటించాడు. అలాగే పహిల్వాన్ అనే కన్నడ చిత్రంలోనూ, దర్బార్ అనే తమిళ చిత్రంలోనూ నటించారు. సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప- ది రూల్’ కోసం సునీల్ శెట్టి కోసం ఒక ప్రత్యేకమైన పాత్రను సృష్టిస్తున్నారట. 
 

Credits: Instagram
You May Also Like These