Advertisement

Suma Kanakala: మెగా హీరో పవన్ తేజ్, యాంకర్ మేఘన నిశ్చితార్థ వేడుకలో కుటుంబ సమేతంగా సందడి చేసిన యాంకర్ సుమ..!

నిన్నటివరకూ తెలుగు బుల్లితెరపై యాంకర్ గా మెరిసిన మేఘన (Anchor Meghana).. త్వరలోనే మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతోంది. ఇప్పటివరకూ యాంకర్ గా మాత్రమే ప్రేక్షకులకు తెలిసిన మేఘన త్వరలో మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల పవన్ తేజ్ ని పెళ్లాడబోతోంది. మెగా హీరో పవన్ తేజ్ కొణిదెల ఇప్పటికే హీరోగా నటించినా సినిమాల ద్వారా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

యాంకర్ మేఘన ‘హెచ్‌బీడీ’ (HBD Movie) చిత్రం ద్వారా వెండితెరపై నటిగా డెబ్యూ మూవీ చేసింది. ఆ తర్వాత 2021లో మెగా హీరో పవన్‌ తేజ్‌కు జోడిగా ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాలో నటించింది. ఆ సినిమా చేస్తున్న సమయంలోనే పవన్ తో మేఘన ప్రేమలో పడిందట. ఒకరికొకరు నచ్చడంతో.. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించినట్లు తెలుస్తోంది. 

కాగా.. పవన్ తేజ్ (Pawan Tej), మేఘన నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మేఘన తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలకు రికార్డ్ స్థాయిలో లైక్స్ వచ్చాయి. ఇక, ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరు కావడం గమనార్హం. 

యాంకర్‌ మేఘన (Anchor Meghana) స్వస్థలం కాకినాడ అని.. ఆమె తండ్రి పోలీసు శాఖలో పనిచేస్తారని తెలుస్తుంది. మేఘన బాల్యం కాకినాడలో పూర్తవగా.. ఆ తర్వాత హైదరాబాద్‌ లో డిగ్రీ పూర్తి చేసిందట. కాలేజీ సమయంలో ఈవెంట్స్‌కి యాంకరింగ్‌ చేస్తూ.. సినిమాల మీద ఆసక్తితో ఆ దిశగా ప్రయత్నాలు చేసిందని సమాచారం. ఇక కొణిదెల పవన్‌ తేజ్‌కు… మెగాస్టార్ చిరంజీవి బాబాయ్‌ అవుతారట. 

వీరిద్దరి ఎంగేజ్ మెంట్ వేడుకకు చిరంజీవి భార్య కొణిదెల సురేఖతో పాటు స్టార్ యాంకర్ సుమ (Anchor Suma), ఆమె భర్త రాజీవ్ కనకాల (Rajiv Kanakala) మరి కొందరు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. సుమ,రాజీవ్ హాజరు కావడంతో వేడుక జరిగే చోట మరింత సందడి నెలకొంది. 

Read More: Suma Kanakala: యాంక‌ర్ సుమ పంచుల వ‌ర్షం.. ప‌రువు తీసేసిన జోగి బ్ర‌ద‌ర్స్!

Credits: pinkvilla
Advertisement
You May Also Like These
Advertisement