న‌వ‌ర‌సాలు పండించిన‌ క‌థానాయ‌క ర‌మ్య‌కృష్ణ‌ (Ramya Krishnan)!.. హ్యాపీ బ‌ర్త్ డే రాజ‌మాత‌

ర‌మ్య‌కృష్ణ (Ramya Krishnan) 1965 సెప్టెంబర్ 15న జన్మించారు. ప్ర‌ముఖ‌ పాత్రికేయుడు, విమర్శకుడు  చోరామస్వామి మేన‌కోడ‌లు ర‌మ్య‌కృష్ణ‌.

సౌత్ స్టార్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ‌ (Ramya Krishnan) గ్లామ‌ర్‌తో పాటు వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించి అంతే పేరు తెచ్చుకున్నారు. దేవ‌త‌ల పాత్ర‌ల్లో న‌టించి అమ్మ‌వారంటే ఇలానే ఉంటారా అనేలా ఆ పాత్ర‌ల్లో జీవించారు. అంతేకాదు విల‌నిజానికి కేరాఫ్ అడ్ర‌స్ అయ్యారు ర‌మ్య‌కృష్ణ‌. ఈ రోజు రమ్య‌కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా పింక్ విల్లా స్పెష‌ల్ స్టోరీ.

ర‌మ్య‌కృష్ణ (Ramya Krishnan) 1965 సెప్టెంబర్ 15న జన్మించారు. త‌మిళ‌నాడులో ప్ర‌ముఖ‌ పాత్రికేయుడు, విమర్శకుడు  చోరామస్వామి మేన‌కోడ‌లు ర‌మ్య‌కృష్ణ‌. 1985లో విడుద‌లైన‌ ‘భలే మిత్రులు’ చిత్రంతో రమ్యకృష్ణ తెలుగు సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు. మొద‌ట గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ కొన్నేళ్ల పాటు టాప్ హీరోయిన్‌గా కొన‌సాగారు. అందంతో పాటు అభిన‌యం ఆమె సొంతం. టాప్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో ర‌మ్య‌కృష్ణ ఓ వెలుగు వెలిగారు. 

 

గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో పాటు విభిన్న‌మైన పాత్ర‌ల‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ముఖ్యంగా అమ్మ‌వారి పాత్ర‌లలో ర‌మ్య‌కృష్ణ జీవించారు. ఎన్నో  లేడీ ఓరియెంటెడ్ పాత్ర‌ల‌లో కూడా న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇక 'న‌ర‌సింహ' సినిమాలో నీలాంబ‌రిగా వెండితెర‌పై రమ్య‌కృష్ణ నటనా ప్ర‌ద‌ర్శ‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో లేడీ విల‌న్‌గా న‌టించి త‌న స‌త్తా ఏంటో చూపించారు.

1989లో రిలీజ్ అయిన‌ 'సూత్రధారులు' చిత్రం ద్వారా ర‌మ్య‌కృష్ణ (Ramya Krishnan) మంచినటిగా పేరు తెచ్చుకున్నారు. ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ర‌మ్య‌కృష్ణ ఎక్కువ సినిమాల‌లో న‌టించారు. 'అన్నమయ్య' సినిమాలో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌కు మంచి గుర్తింపు వ‌చ్చింది. అలాగే 'అమ్మోరు' చిత్రంలో కూడా అమ్మ‌వారి పాత్ర‌లో ఒదిగిపోయి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. 'బాహుబ‌లి' చిత్రంలో రాజ‌మాత శివ‌గామి పాత్ర‌లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ మ‌రోసారి త‌న న‌ట విశ్వ‌రూపం చూపారు.

ర‌మ్య‌కృష్ణ రెండు నంది పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ నటీమణిగా 'కంటే కూతుర్నే కను' అనే సినిమాకు గాను నంది అవార్డు అందుకున్నారు. 'రాజు మహారాజు' సినిమాకు గానూ ఉత్త‌మ స‌హాయ న‌టిగా ర‌మ్య‌కృష్ణ నంది అవార్డు అందుకున్నారు. 

స్వతహాగా మంచి నృత్యకారిణి అయిన రమ్యకృష్ణ దేశ‌విదేశాల్లో ప‌లు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు దర్శకుడు కృష్ణవంశీని పెళ్ళి ర‌మ్య‌కృష్ణ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.

Read More: Jailer: ర‌జ‌నీకాంత్ (Rajinikanth) సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌ (Ramya Krishnan)!

 ర‌మ్య‌కృష్ణ మ‌రిన్ని పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచాల‌ని పింక్ విల్లా కోరుకుంటుంది. 
హ్యాపీ బ‌ర్త్ డే ర‌మ్య‌కృష్ణ‌
Credits: Twitter
You May Also Like These