పాటల ప్రపంచానికి రారాజుగా కృష్ణకుమార్ కున్నత్ (Singer KK) ఓ వెలుగు వెలిగారు. బాలీవుడ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు కృష్ణకుమార్ కున్నత్. బాలీవుడ్‌లో కృష్ణకుమార్ కున్నత్‌ను ముద్దుగా కేకే అని పిలుచుకుంటారు. హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ తనదైన స్టైల్లో సాంగ్స్‌ను ప్రేక్షకులకు వినిపించారు. హిందీతో పాటు 11 భాషల్లో కేకే పాటలు పాడారు. దాదాపు 3500 పాటలు పాడి గ్రేట్ ఇండియన్ సింగర్‌గా నిలిచారు.
కేకే (Singer KK) గుండె ఆగిపోవడంతో సంగీత ప్రియులు దుఖంలో మునిగిపోయారు. విరహ గీతాలతో మనసుకు దగ్గరైన కేకే లేరనే వార్తతో అభిమానుల గుండెలు బరువెక్కాయి. తెలుగులో కూడా కృష్ణకుమార్ కున్నత్ ఎన్నో పాటలను పాడారు. టాప్ హీరోలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించారు.
1.ప్రేమదేశం సినిమలో యువతకు హుషారెత్తించే పాట హలో డాక్టర్ హార్ట్ మిస్పాయే. కేకే తెలుగులో పాడిన మొదటి పాట ఇదే. అబ్బాస్, వినిత్, టబులు కలిసి నటించిన సినిమా ప్రేమదేశం.
2.ఖుషీ సినిమాలోని ఏ మేరా జహా పాటను కేకే సూపర్‌గా పాడారు. హిందీలోనే సాగే ఈ పాట కేకే గొంతుతో తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది. పవన్ కల్యాణ్, భూమిక హీరో హీరోయిన్లుగా ఖుషీ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో పాటలు ఓ లెవల్‌లో పేలాయి. కేకే వాయిస్ సినిమాకు ప్లస్ అయింది.
3.7/G బృందావన్ కలానీ సినిమాలో తలచి తలచి చూశా అంటూ విరహ గీతాన్ని కేకే అద్భుతంగా పాడారు. తెలుగు ప్రజలు ఎప్పటికీ తలచుకునే పాటగా ఈ సాంగ్ నిలిచింది. రవికృష్ణ, సోనియా అగర్వాల్ ఈ సినిమాలో జంటగా నటించారు.
4.ఓ సారి ప్రేమించాకా.. ఓ సారి మనసిచ్చాక మరపంటూ రానేరాంటూ ఆంధ్రుడు సినిమాలో కేకే పాడిన పాటకు మంచి గుర్తింపు దక్కింది. చాలా సాప్ట్ వాయిస్‌తో మనసుని టచ్ చేసేలా కేకే పాడుతారు. గోపిచంద్, గౌరి పండిట్ ఈ సినిమాలో జంటగా నటించారు.
5. ఆర్య2 సినిమాలో ఉప్పెనంత ఈ ప్రేమకి.. గుప్పెడెంత గుండె ఏమిటో పాటను పాడారు కేకే. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ నటించిన ఆర్య2 సినిమాలో ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది.
6. చెలియా.. చెలియా.. అలల ఒడిలో ఎదురు చూస్తున్న అంటూ ఘర్ణణలో కేకే పాడిన పాట ఓ క్రేజీ సాంగ్ . వెంకటేష్, ఆశిన్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు.
7. మహేష్ బాబు, త్రిష నటించన అతడు సినిమాలో కేకే ఓ పాటను పాడారు. అవును నిజం.. నువ్వుంటే నాకిష్టం పాటను సూపర్‌గా పాడారు.
8. గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి.. అంటూ నిదురించే జ్ఞాపకాలను కేకే తన పాటతో తట్టి లేపారు. రవి తేజ నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాలోని ఈ పాట అప్పట్లో పాపులర్ అయింది.
9. ఇంద్ర సినిమాలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ దాయి.. దాయి .. దామ్మ. ఈ పాటకు చిరంజీవి, సోనాలి బింద్రే వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. కేకే చిరంజీవి కోసం దాయి. దాయి. దామ్మ పాడారు.
10 . డార్లింగ్ సినిమాలో హోసా హోరే.. సాధించే సత్తువ ఉంది అంటూ కేకే పాడారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో నటించారు.
Follow Us