‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సమంత రుత్ ప్రభు (Samantha). తన అందం, అభినయంతో కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకుంది సమంత. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరి స్టార్ హీరోలతోనూ నటించింది ఈ భామ. 2010లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత 12 ఏండ్లు గడుస్తున్నా చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.
ఇక, నాగచైతన్యతో విడాకుల తర్వాత మరింత బిజీగా మారింది సమంత. వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్‌పైనే ఫోకస్ చేసింది. సమంత నటించిన కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఖరారు కానప్పటికీ కాశ్మీర్లో షూటింగ్ జరుగుతోంది.
సోషల్ మీడియాలో కూడా సమంత చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చైతో విడిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో సమంత పెడుతున్న పోస్టులపై అభిమానులకు అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో సమంత పెట్టిన ఒక పోస్టు వైరల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టే కొటేషన్లు, ట్విట్టర్లో షేర్ చేసే ట్వీట్లు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నదో తెలుసుకోవాలని ఫ్యాన్స్ తెగ ప్రయత్నిస్తున్నారు. ఇటీవల సమంత చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. #asksam పేరుతో సమంత తన అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ నేపథ్యంలో వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఒకేసారి మీకు ఎదురవుతున్న ప్రేమ, ద్వేషం.. ఈ రెండింటినీ ఎలా తీసుకుంటారు అని ఒక అభిమాని సమంతను ప్రశ్నించాడు. దానికి సమంత ఇచ్చిన సమాధానం ఏంటంటే.. ఈ ప్రేమ, ద్వేషం వంటి వాటిలో మళ్లీ పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. వీటికి దూరంగా ఉండటం మంచిది అని అభిమానికి రిప్లై ఇచ్చింది.
ఇటీవల అంటే ఏప్రిల్ 28న 35వ వసంతంలోకి అడుగుపెట్టిన సమంతకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన వాళ్లందరికీ ధ్యాంక్యూ చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది సమంత. ‘నా పుట్టినరోజున మీరు నా మీద చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్‌కు, నాపై మీకున్న సానుకూలతకు ఎప్పటికీ కృతజ్ఞురాలిగా ఉంటా. మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీ అందరూ నాలో ఉత్సాహాన్ని నింపారు’ అని సామ్ (Samantha) పోస్ట్ చేసింది.
Follow Us