RIP Superstar Krishna: తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా పలు సినిమాలను నిర్మించారు. అంతేకాకుండా పద్మాలయ స్టూడియోను స్థాపించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కృష్ణ కుమారుడు మహేష్ బాబు కూడా తన తండ్రిలానే నటనా రంగంలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. బాల నటుడిగా సినీ జీవితం ప్రారంభించిన మహేష్ బాబు తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. తండ్రీకొడుకులు నటించిన సినిమా విశేషాలు పింక్ విల్లా ఫాలోవర్స్ కోసం.
1. పోరాటం
మహేష్ బాబు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ (Krishna)తో కలిసి 'పోరాటం' అనే సినిమాలో మొదటి సారి నటించారు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తన తండ్రికి తమ్ముడిగా నటించారు మహేష్ బాబు. పోరాటం సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
2. శంఖారావం
మహేష్ బాబు తన తండ్రి కృష్ణతో నటించిన రెండో సినిమా 'శంఖారావం'. ఈ సినిమాకు దర్శకుడిగా కృష్ణ వ్యవహరించారు. ఈ సినిమాలో కృష్ణ, మహేష్ బాబు తండ్రీకొడుకులుగా వెండితెరపై అలరించారు.
3. బజారు రౌడీ
మహేష్ బాబు (Mahesh Babu) అన్నయ్య రమేష్ బాబుతో కలిసి నటించిన సినిమా 'బజారు రౌడీ'. ఈ సినిమాలో కృష్ణ అతిథి పాత్రలో నటించారు.
4.ముగ్గురు కొడుకులు
మహేష్ బాబు కృష్ణతో కలిసి నటించిన నాల్గో సినిమా 'ముగ్గురు కొడుకులు'. ఈ సినిమాలో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూడా నటించారు. ఈ చిత్రంలో కృష్ణ తమ్ముళ్లుగా మహేష్ బాబు, రమేష్ బాబు నటించారు.
5. గూఢచారి 117
కృష్ణకు 'గూఢచారి 117' సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చింది. మహేష్ బాబు కూడా ఈ సినిమాలో నటించారు.
6. కొడుకు దిద్దిన కాపురం
మహేష్ బాబు నటించిన 'కొడుకు దిద్దిన కాపురం' సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో మహేష్ బాబు నటనను పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు.
7. అన్నాతమ్ముడు
'అన్నాతమ్ముడు' సినిమాలో మహేష్, కృష్ణ తండ్రీ కొడుకులుగా నటించారు. కృష్ణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది.
8. రాజకుమారుడు
మహేష్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమా 'రాజకుమారుడు'. ఈ సినిమాలో కృష్ణ గెస్ట్ రోల్ లో వెండితెరపై కనిపించారు. వీరిద్దరూ ఒక సన్నివేశంలోనే కనిపించినా.. బాక్సాఫీస్ ను షేక్ చేశాలా నటించారు.
9. వంశీ
మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా బి. గోపాల్ దర్శకత్వంలో విడుదలైన సినిమా 'వంశీ'. ఈ సినిమాలో తన తండ్రితో కలిసి నటించారు ప్రిన్స్. అంతేకాదు తన భార్య నమత్రా శిరోద్కర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. 'వంశీ' సినిమా మహేష్ కు అనుకున్నంత హిట్ ఇవ్వలేదు
10. టక్కరి దొంగ
సూపర్ స్టార్ కృష్ణ అంటే కౌబాయ్ సినిమాలకు పెట్టింది పేరు. కృష్ణ కుమారుడు మహేష్ కూడా కౌబాయ్ సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో 'టక్కరి దొంగ' ఒకటి. 'టక్కరిదొంగ' క్లైమాక్స్ సన్నివేశాల్లో కృష్ణ నటించారు.
Read More: RIP Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ (krishna) అంత్యక్రియలు పూర్తి
Follow Us