RIP Superstar Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ (krishna) అంత్యక్రియలు పూర్తి

Updated on Nov 15, 2022 12:26 PM IST
RIP Superstar Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ (krishna).. మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...
RIP Superstar Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ (krishna).. మనుష్యులందు నీ కధ... మహర్షిలాగ సాగదా...
సూపర్ స్టార్ కృష్ణకు అశ్రునివాళి

సూపర్ స్టార్  కృష్ణకు అశ్రునివాళి

హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ లాంచనాలతో కృష్ణ అంత్యక్రియలు జరిపారు. మహేష్ బాబుతో పాటు కుటుంబసభ్యులు, అభిమానులు కృష్ణకు కన్నీటి నివాళులు అర్పించారు. 

తెలుగు సినిమా పరిశ్రమలో కృష్ణ స్థానం సుస్థిరం. టాలీవుడ్ రికార్డులలో నంబర్ వన్ హీరో కృష్ణ. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరిపోని ముద్ర వేశారు. కృష్ణకు కుటుంసభ్యులు, అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు అశ్రునివాళి అర్పించారు. 

మొదలైన కృష్ణ అంత్యక్రియలు

సూపర్‌ స్టార్‌ కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతున్నాయి. ఆయన పార్ధివ దేహానికి పోలీసులు గౌరవ వందనం చేసి నివాళులు అర్పించారు. గాలిలోకి మూడు రౌండుల కాల్పులతో పోలీసులు కృష్ణకు నివాళి అర్పించారు. 

మొదలైన కృష్ణ గారి అంతిమ యాత్ర

ప్రారంభమైన సూపర్ స్టార్  కృష్ణ అంతిమ యాత్ర

కృష్ణ గారి అంతమ యాత్ర ప్రారంభమైంది. తెలుగు సినిమా పరిశ్రమ కోసం కృష్ణ గారి చేసిన సేవలు గుర్తుతెచ్చుకుంటూ పలువురు సినీ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో కృష్ణ గారి అంత్యక్రియలు మధ్యాహ్నాం 3.00 గంటలకు ప్రారంభం కానున్నాయి. 

ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు

తెలంగాణ గవర్నర్ తమిళ సై సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మహేష్ బాబుతో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. 

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంచనాలతో జరగనున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా నిన్న సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 

సూపర్ స్టార్ కృష్ణ అమర్ రహే

అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివదేహాన్ని పద్శాలయ స్టూడియోలో ఉంచారు. మరి కాసేపట్లో మహాప్రస్థానంలో నట శేఖరుడి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పద్మాలయ స్టూడియో బయట సూపర్ స్టార్ కృష్ణ అమర్ రహే అంటూ ఆయన అభిమానులు నినాదాలు  చేస్తున్నారు. 

కృష్ణ రియల్ హీరో - అల్లు అరవింద్

కృష్ణ గారు రీల్ హీరో మాత్రమే కాదు.. రియల్ హీరో అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. నిర్మాతలు బాగుండాలని కోరుకునే వ్యక్తి కృష్ణ అన్నారు. కృష్ణ గారు చనిపోవడం బాధాకరమన్నారు. కృష్ణ గారి అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో.. ఇక్కడికి వచ్చిన అభిమానులను చూస్తుంటే అర్థమవుతుందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. 

కృష్ణ గారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాళులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  కృష్ణ గారి భౌతిక కాయానికి సందర్శించారు పూల మాల వేసి నివాళులు అర్పించారు. మహేష్ బాబుకు వైఎస్ జగన్ సానుభూతి తెలిపారు.  

కృష్ణకు నివాళి అర్పించిన బాలకృష్ణ

సూపర్ స్టార్ కృష్ణ భౌతిక కాయాన్ని హీరో బాలకృష్ణ సందర్శించారు. బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా కృష్ణ గారి పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. మహేష్ బాబుతో పాటు కృష్ణ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. 

తాతయ్యకు సితార నివాళి

సూపర్ స్టార్ కృష్ణకు మహేష్ కూతురు, కుమారుడు నివాళులు అర్పించారు. గౌతమ్ ఘట్టమనేని, సితార ఘట్టమనేని తమ తాతయ్య భౌతిక కాయాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

కన్నీరు మున్నీరవుతున్న అభిమానులు

కృష్ణ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ మంచితనాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. 

తండ్రిపై భావోద్వేగ ట్వీట్ చేసిన మంజుల

కృష్ణ గారి కూతురు మంజుల ఘట్టమనేని భావోద్వేగ ట్వీట్ చేశారు. ప్రపంచానికి సూపర్ స్టార్ అయిన తన తండ్రి.. ఇంట్లో మాత్రం సాధారణ తండ్రిలా తమకు ప్రేమను పంచారంటూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రి సినిమాలు తరతరాలకు గుర్తుండిపోతాయంటూ మంజుల ఘట్టమనేని పేర్కొన్నారు.

కృష్ణ గారిపై గౌరవంతో షూటింగ్స్ నిలిపివేత

కృష్ణ గారి మరణంతో తెలుగు సినిమా పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. కృష్ణ గారిపై అభిమానంతో.. ఆయనపై ఉన్న గౌరవంతో తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కీలక ప్రకటన చేసింది. ఈ రోజు సినిమా షూటింగ్స్ అన్ని ఆపేయాలని నిర్ణయించింది. 

కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలి- రజనీకాంత్ ట్వీట్

కృష్ణ గారి మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. కృష్ణ గారితో కలిసి మూడు సినిమాలో నటించడం మరిచిపోలేని అనుభవం అంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు. 

కృష్ణ గారి మరణంతో ఓ శకం ముగిసిందంటూ కమల్ హాసన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో అన్న, అమ్మ, నాన్నను పోగొట్టుకున్న మహేష్ బాబుకు తన ప్రగాఢ సానుభూతి అంటూ కమల్ ట్వీట్ చేశారు. 

సూపర్ స్టార్ కృష్ణ అమర్ రహే - చిత్తూరు అభిమానులు

సూపర్ స్టార్ కృష్ణ మరణంపై ఆయన అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో  కృష్ణ గారికి వినూత్న రితీలో నివాళులు అర్పించారు. సూపర్ స్టార్ కృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. 

కృష్ణ గారి మృతి బాధాకరం - విజయశాంతి

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి మృతి బాధాకరం అంటూ నటి విజయశాంతి ట్వీట్ చేశారు. కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానంటూ విజయశాంతి తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

బుధవారం కృష్ణ గారి అంత్యక్రియలు 

సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివ దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం నానక్‌రామ్‌గూడలోని విజయకృష్ణ నిలయం వద్దే ఉంచనున్నారు. మంగళవారం సూర్యాస్తమయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కృష్ణ గారి అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాలతో మహాప్రస్థానంలో జరగనున్నాయి.

కృష్ణ పార్ధీవ దేహాన్ని సందర్శించిన ప్రభాస్

సూపర్ స్టార్ కృష్ణ పార్ధీవ దేహాన్ని హీరో ప్రభాస్ సందర్శించారు. పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహేష్ బాబును కలిసి సానుభూతి తెలిపారు ప్రభాస్. 

తండ్రి చిత్ర పటానికి పూల మాల వేసిన మహేష్

మహేష్ బాబు తన తండ్రి కృష్ణ గారి మరణంతో తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. తండ్రిని గుర్తు చేసుకుంటూ బోరున విలపించారు. కృష్ణ గారి భౌతిక కాయాన్ని చూసేందుకు వచ్చిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మహేష్ బాబుకు ధైర్యం చెబుతున్నారు. 

ఇటీవలే మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి, అన్న రమేష్ బాబులను కోల్పోయారు. ప్రస్తుతం తన తండ్రి మరణంతో మహేష్ దు:ఖ సాగరంలో మునిగిపోయారు. కృష్ణ, మహేష్ అభిమానులు మహేష్ బాబుకు సానుభూతి తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని రష్మిక ట్వీట్

టాలీవుడ్ నటి రష్మిక మందన్న కృష్ణ మరణంపై నివాళులు అర్పించారు. కృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. మహేష్ బాబుకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానంటూ రష్మిక ట్విట్టర్ లో తెలిపారు. 

మహేష్ కుటుంబానికి సానుభూతి తెలిపిన పూజ

మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణంపై హీరోయిన్ పూజా హెగ్డే నివాళులు అర్పించారు. కృష్ణ గారి వారసత్వం ఆయన సినిమాతో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని పూజ ట్వీట్ చేశారు. 

See More Updates