బాలీవుడ్ తనను భరించలేదని మహేష్ (Mahesh Babu) చేసిన కామెంట్ వైరల్ అవుతోంది. కొందరు మహేష్ అన్నదానిలో తప్పు ఏమందంటే.. మరి కొందరు తప్పేనని అంటున్నారు. అసలు మహేష్ బాలీవుడ్‌పై చేసిని కామెంట్లు ఏంటి?. మహేష్ కామెంట్లపై ఎవరెవరు రియాక్ట్ అయ్యారు.
బాలీవుడ్ గురించి మహేష్ ఏమన్నారు?
హీరో అడవి శేష్ నటించిన మేజర్ ప్రమోషన్ కోసం మహేష్ బాబు (Mahesh Babu) వెళ్లారు. బాలీవుడ్‌లో నటిస్తారా అని మహేష్ బాబును ఓ రిపోర్టర్ అడిగారు. తాను తెలుగు సినిమాలో స్టార్ హీరో అని.. తెలుగు సినిమాలే చేస్తానని మహేష్ బాబు అన్నారు. తనకు ఇంత పెద్ద స్టార్ డమ్ వచ్చిన తర్వాత హిందీలో సినిమాలు తీసి అక్కడ మళ్లీ స్టార్ డమ్ తెచ్చుకోవడానికి టైం వేస్ట్ చేయాలనుకోవడం లేదన్నారు. బాలీవుడ్ తన రేంజ్‌కు తగ్గ సినిమాలు తీయాలంటే భరించలేదన్నారు. హిందీ సినిమాలకు సంబంధించి చాలా ఆఫర్లు తనకు వచ్చాయని.. కానీ తాను హిందీ సినిమాలు చేయనని మహేష్ చెప్పారు. ప్రస్తుతం నార్త్ సినిమా వాళ్లు తెలుగు సినిమా వైపు చూస్తున్నారన్నారు. మన తెలుగులో పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయని మహేష్ చెప్పారు
మహేష్ కామెంట్స్‌కు రియాక్షన్
మహేష్ బాబు (Mahesh Babu) ను హిందీ సినిమాల్లో తీసుకునేంత డబ్బు నిర్మాతల దగ్గర లేదా అంటూ బాలీవుడ్ న్యూస్ వెబ్ సైట్లు రాశాయి. బాలీవుడ్‌పై మహేష్ బాబు కామెంట్లకు కొందరు మద్దతు తెలుపుతుంటే.. మరి కొందరు తప్పుబడుతున్నారు.మహేష్ బాబు హిందీలో పలు యాడ్లు చేశారు. మహేష్ యాడ్లు తెలుగుతో పాటు వేరే భాషల్లోకి డబ్ అవుతుంటాయి. ఇక మహేష్ సినిమాలు హిందీలోనూ డబ్ అవుతుంటాయి. నార్త్ ఇండియాలోనూ మహేష్ బాబు సినిమాలకు క్రేజ్ ఉంది.
మహేష్ బాలీవుడ్ కామెంట్స్‌కు రియాక్షన్
అతుల్
మషేష్ కామెంట్స్ చైల్డిష్‌గా ఉన్నాయని అతుల్ అన్నారు. అక్షయ్, హృతిక్ 120 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. సౌత్ స్టార్లకు అంత పెద్ద మొత్తంలో ఎవరు ఇస్తారని అతుల్ ప్రశ్నించారు. రజనీకాంత్ లాంటి స్టార్‌కు ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు.. ఆయన్ని ఎవరితోనూ పోల్చలేం అన్నారు అతుల్.
కంగనా
.మహేష్ బాబు చేసిన కామెంట్స్‌లో తప్పులేదని బాలీవుడ్ బ్యూటీ కంగనా అన్నారు. హిందీ సినిమాల్లో నటించాలని చాలా మంది బాలీవుడ్ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్ దేశంలోనే నంబర్ వన్‌లో ఉంది. సో అంతటి రెమ్యునరేషన్ బాలీవుడ్ మహేష్ బాబుకు ఇవ్వలేదని కంగానా రియాక్డ్ అయింది.
రామ్ గోపాల్ వర్మ
సౌత్ ఇండియా చిత్రాలు సక్సెస్ సాధిస్తున్నాయి.. నార్త్ మూవీస్ ప్లాప్‌లు పొందుతున్నాయని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి చూస్తుంటే.. ఓటీటీల్లో సినిమాలు రిలీజ్ చేయడానికే సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు.
బోనీకపూర్
మహేష్ బాలీవుడ్‌పై చేసిన కామెంట్ల పూర్తిగా అతని వ్యక్తిగతం అని బోనీకపూర్ అన్నారు. తాను నార్త్, సౌత్ రెండిటినీ ఒకేలా చూస్తానన్నారు. హిందీతో పాటు తమిళ్, తెలుగు సినిమాలకు తాను నిర్మాతగా ఉన్నానని చెప్పారు. త్వరలో మళమాళం, కన్నడలో కూడా సినిమాలు తీస్తున్నానని చెప్పారు. మహేష్ బాబును నిజంగా బాలీవుడ్ భరించలేదేమో... ఎందుకంటే అది మహేష్ బాబు ఫీలింగ్ అన్నారు. మహేష్ బాబు తన అభిప్రాయాన్ని చెప్పారు.. దానిపై కామెంట్లు చేయడం సరికాదన్నారు.
కన్నడ హీరో సుదీప్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ మధ్య జరిగిన ట్వీట్స్ వార్ ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా మహేష్ బాబు (Mahesh Babu) కామెంట్లపై రియాక్ట్ అవుతున్నారు
సౌత్, నార్త్ అంటూ నటీనటులు తమ మనసులో ఉంది బయట పెట్టేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ గ్రేట్ అనే పీలింగ్‌లో సౌత్ యాక్టర్లను ఎంత చులకన చేసి మాట్లాడారో అనిపిస్తుంది.
Follow Us