Virata Parvam Ott Release: విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో రానా, సాయిపల్లవితో పాటు, ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు, నివేదా పేతురాజ్ కూడా నటించారు.
ఈ మూవీ జూన్ 17న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టినట్టు కూడా తెలుస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల తనదైన శైలిలో తెరకెక్కించగా .. రానా దగ్గుబాటి, సాయి పల్లవి (Sai pallavi) సహజంగా నటించి ఆడియెన్స్‌ను మెప్పించారు.
ముఖ్యంగా వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అచ్చం తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక కామ్రేడ్ రవన్న పాత్రలో రానా (Rana Daggubati) ఒదిగిపోయాడు. తెరపై నిజమైన దళనాయకుడిగా కనిపించారు.
ఇప్పటివరకు థియేటర్స్‌లో సందడి చేసిన ఈ చిత్రం.. ప్రస్తుతం ఓటీటీలో అలరించడానికి సిద్దమైంది. ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో రూ.15 కోట్లకు ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకుందని సమాచారం. ఏదేమైనా ‘విరాట పర్వం’ చిత్రాన్ని ఓటీటీలో చూసేందుకు వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకు ఇది ఒక రకంగా గుడ్ న్యూసే.
కాగా, విడుదలైన రెండు వారాలకే ఈ చిత్రం (Virata Parvam Ott Release) ఓటీటీలో రాబోతోంది. జూలై ఒకటో తేదీ నుంచి విరాటపర్వం నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
1990లో తెలంగాణలో జరిగిన నక్సలైట్ ఉద్యమ నేపథ్యం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ ఉద్యమ సమయంలోనే వరంగల్‌కు చెందిన అభ్యుదయ వాది సరళ ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఆమె జీవితంలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ కావడంతో పలువురు ఈ చిత్ర ప్రదర్శనపై అభ్యంతరం కూడా తెలిపారు.
Follow Us