దేవదాసు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ పోతినేని (Ram Pothineni).. తన ఎనర్జెటిక్ యాక్టింగ్‌తో తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ఆడియన్స్‌కు కూడా దగ్గర కావాలనే ఉద్దేశంతో లవర్ బాయ్‌గా కూడా పలు సినిమాల్లో నటించాడు. తర్వాత మరోసారి మాస్ ఇమేజ్ వైపు అడుగులు వేస్తున్నాడు రామ్. ఇటీవల రెడ్ సినిమాలో ఒక క్యారెక్టర్లో మాస్‌గా నటించి మెప్పించాడు. ఇస్మార్ట్ శంకర్‌లో విభిన్నమైన పాత్రను సెలెక్ట్ చేసుకుని హిట్ అందుకున్నాడీ ఎనర్జెటిక్ స్టార్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూర్తి మాస్ హీరోగా మారిపోయాడు రామ్. తర్వాత చేసే సినిమాలను కూడా మాస్ జోనర్ లోనే చేస్తున్నాడు.
ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్లో వస్తున్న ‘ది వారియర్’ సినిమాలో నటిస్తున్నాడు రామ్. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమా తర్వాత మాస్ డైరెక్టర్ బోయపాటి శీను దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాక ముందే మరో సినిమాను లైన్లో పెట్టాడీ యంగ్ హీరో.
పవన్ కల్యాణ్‌తో గబ్బర్‌సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తెరకెక్కించిన డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సినిమా చేయనున్నట్టు ప్రస్తుతం టాలీవుడ్ టాక్. ఈ మధ్యనే రామ్‌కు హరీష్ స్టోరీ లైన్ చెప్పాడని, దానికి రామ్ కూడా ఓకే చెప్పాడని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన కూడా వచ్చే చాన్స్ ఉందని సమాచారం . ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కల్యాణ్‌తో భవదీయుడు భగత్ సింగ్ సినిమా తీయనున్నట్టు ప్రకటించాడు. జూలై నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా తర్వాత రామ్ (Ram Pothineniతో సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
Follow Us