RRR.. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఓ అద్భుత చిత్రం.. విజువల్ వండర్. ఈ సినిమాకి ప్రస్తుతం దేశ, విదేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan) కథానాయకులుగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ రేసులో కూడా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఈ సినిమాపై తమ అభిమానాన్ని చాటుకుంటూ ఎందరో అభిమానులు ఎన్నో క్యారికేచర్స్, పెయింటింగ్స్ వేశారు. అందులో నుండి ఓ టాప్ 5 ఆర్టిస్టిక్ వర్క్స్ మీకోసం ప్రత్యేకం
దోస్తీకి సిసలైన ఉదాహరణ
RRR.. ఈ సినిమాలోని 'దోస్తీ' సాంగ్‌కి సిసలైన ఉదాహరణ ఈ పెయింటింగ్. ఈ పెయింటింగ్ చాలా రోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆఖరికి చిరంజీవి (Chiranjeevi) కుటుంబానికి చెందిన కొణిదెల పవన్ తేజ్ అనే నటుడు కూడా ఈ పెయింటింగ్ వర్క్‌ను తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేయడంతో, ఈ ఆర్ట్ ఇంకా చాలా మంది అభిమానులకు చేరింది.
అమూల్ వారి పెయింటింగ్
ఏదైనా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే, ఆ చిత్రానికి ట్రిబ్యూట్ రూపంలో అమూల్ (Amul) సంస్థ, క్యారికేచర్స్ వేయిస్తుంది. అలా 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ కోసం కూడా ఓ పెయింటింగ్ వేయించింది. ఇది కూడా ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
విదేశీ క్యారికేచర్
అవెన్ (Aven) అనే ఓ విదేశీ ఆర్టిస్టు గీసిన పెయింటింగ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ఓ సీన్‌ను బేస్ చేసుకొని.. 'నా కళ్లలోకి చూసి మాట్లాడు సోదరా' అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ను ప్రశ్నించే సన్నివేశాన్ని పెయింటింగ్‌గా మలిచాడు ఈ ఆర్టిస్టు.
మైత్రికి సంకేతం
'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజులను పోలిన పాత్రల మధ్యనున్న స్నేహానికి అద్దం పడుతూ కూడా, 'పర్స్పెక్టివ్ బడ్' (Perspective Bud) పేరు మీద ఓ పోస్టర్‌ను కొందరు వైరల్ చేశారు. దీనిని రాజమౌళి తన సోషల్ మీడియా పేజీలలో షేర్ చేశారు కూడా.
బోర్న్ టు ఫైట్
ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం రామ్ చరణ్ అభిమానుల కోసం ఫుల్ ఫిల్మీ (Full Filmy) అనే సంస్థ డిజైన్ చేసిన ఈ పోస్టర్ కూడా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో రామ్ చరణ్ బాక్సింగ్ చేస్తున్న సీన్‌ను చాలా డిఫరెంట్‌గా చిత్రీకరించారు ఆర్టిస్టు
ఇవండీ.. ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించిన క్యారికేచర్ ముచ్చట్లు
Read More: RRR: 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ (Ram Charan) నటన ఆస్కార్ లెవల్ అంటున్న అభిమానులు !
Follow Us