Raadhika Sarathkumar: రాధిక శరత్ కుమార్‌కు ఎన్టీఆర్ నటన అంటే ఇష్టమట. అవకాశం వస్తే జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తారట.
రాధిక శరత్ కుమార్(Raadhika Sarathkumar) సౌత్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైన కూడా రాధిక స్టార్ యాక్టరే. ఎన్నో సీరియల్స్ నటిస్తూ.. నిర్మిస్తూ ప్రేక్షకులకు వినోదం అందించడంలో ముందుంటారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో తన తండ్రి ఎం.ఆర్ రాధా, ఎంజీఆర్ మధ్య చోటు చేసుకున్న వివాదంపై వెబ్ సిరీస్ చేస్తున్నారు.
తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో రాధిక శరత్‌కుమార్ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమన్నారు. అంతేకాదు ఎన్టీఆర్‌తో యాక్ట్ చేయాలని ఉందని మనసులో మాట చెప్పారు. ఎన్టీఆర్ యాక్టింగ్, డాన్స్ తనకు ఎంతో ఇష్టమన్నారు. తన మనువడికి తారక్ అని పేరు పెట్టామని చెప్పారు. తారక్ అనే పేరంటే కూడా రాధిక శరత్‌కుమార్‌కు ఇష్టమట.
రాధిక తండ్రికి, ఎంజీఆర్ మధ్య జరిగిన కాల్పుల సంఘటన గురించి చాలా మందికి తెలుసని రాధిక అన్నారు. ఆ సంఘటన నేపధ్యంలో ఓ వెబ్ సీరీస్ నిర్మిస్తున్నారట. జులై నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ హైదరాబాద్‌లోనే జరుగుతుంది. రాడాన్ సంస్థ తన సొంత బ్యానర్ అని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నానని చెప్పారు రాధిక శరత్‌కుమార్(Raadhika Sarathkumar).
Follow Us