ఎన్‌బీకేకు (NBK) తగ్గ కథ రెడీ చేస్తున్న ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru) !

కల్యాణ్‌రామ్, నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), ఎన్టీఆర్‌‌ల కోసం ప్రవీణ్‌ కథ

ఇద్దరు హీరోలు ఒకేసారి స్క్రీన్‌ మీద కనిపిస్తే ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తే పండగే. ఇక ముగ్గురు మాస్ హీరోలు వెండితెరపై కనిపిస్తే..  అభిమానులు తట్టుకోగలరా? అటువంటిది నందమూరి ఫ్యామిలీ హీరోలు మల్టీస్టారర్‌‌ చేస్తే ఫ్యాన్స్​ ఊరుకుంటారా? ఎగిరి గంతేయరూ! నందమూరి బాలకృష్ణ, (Nandamuri Balakrishna), జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కల్యాణ్‌రామ్‌తో  (Kalyan Ram) లతో మల్టీస్టారర్‌‌ సినిమా చేయడానికి ప్రవీణ్‌ సత్తారు (Praveen Sattaru) కథ రెడీ చేస్తున్నారని టాక్. మాస్‌ హీరోలకు కథ రాయడం, వారికి చెప్పి ఒప్పించడం మామూలు విషయం కాదు. అందులోనూ మల్టీస్టారర్‌‌గా తెరకెక్కించే సినిమాలో ముగ్గురు హీరోలకూ సమాన ప్రాధాన్యత ఉండేలా కథ రాయాలి. దానిని అంతే చాకచక్యంగా తెరకెక్కించే సత్తా కూడా ఉండాలి.

 కథ చెప్పడమే లేట్..

ఎన్‌బీకే కథను ప్రవీణ్‌ ఇప్పటికే రెడీ చేశారని, ఈ కథను ముగ్గురికీ చెప్పి సినిమా చేయడానికి వారిని ఒప్పించడమే మిగిలి ఉందని ఇండస్ట్రీ టాక్. అయితే ఇదే అతిపెద్ద సవాల్‌. అలాగే కథనం, అందులోని ప్రధానాంశాలు కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకులను ప్రత్యేకంగా అభిమానులను నిరాశపరచకుండా ఉండేలా సినిమా తీయాలి. కథలోని అన్ని అంశాలపైనా, వాటిని చిత్రీకరించే విధానంపైనా పట్టు సాధించిన తర్వాతే, ముగ్గురు హీరోలకు కథ చెప్పాలని ప్రవీణ్‌ అనుకుంటున్నారని తెలుస్తోంది. ఇక, ఎన్‌బీకే (NBK) అంటే అందరికీ వెంటనే స్ఫురణకు వచ్చేది నందమూరి బాలకృష్ణ గారి పేరే. అయితే ఎన్‌బీకే (NBK) అంటే ఎన్టీఆర్–బాలకృష్ణ–కల్యాణ్‌రామ్‌ అని కొత్త అర్థాన్ని ఇప్పటికే కనిపెట్టేశారు. ఎప్పటినుండో నందమూరి ఫ్యామిలీతో మల్టీస్టారర్ చేయాలని చాలామంది డైరెక్టర్లు ప్లాన్ చేశారు. అయితే ఆ ఆలోచన పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా అది పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

You May Also Like These