పాన్ ఇండియా హీరో ప్రభాస్(Prabhas) నటిస్తున్న కొత్త మూవీల కోసం కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. మొదటిసారిగా ఓ సరికొత్త టెక్నాలజీతో వచ్చే భారతీయ సినిమాలో ప్రభాస్(Prabhas) నటిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ పాజెక్ట్.కే (Project K) సినిమా లేటెస్ట్ అప్‌డేట్స్ వచ్చేశాయి.
బాహుబలి తర్వాత ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రభాస్(Prabhas) సినిమాలపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ కూడా భారీ ప్రాజెక్టులతో రికార్డులు బద్దలు కొట్టే సినిమాలు చేయాలని ప్లాన్ చేశారు. రాధేశ్యామ్ నిరాశపరిచినా.. డార్లింగ్ సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు.
మహానటి, జాతిరత్నాలు సినిమలతో స్టార్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్‌తో ప్రభాస్(Prabhas) సినిమా చేయబోతున్నారు. ప్రభాస్(Prabhas), నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టు త్వరలో మూడో షెడ్యూల్ షూటింగ్ జరపుకోనుంది. ప్రభాస్(Prabhas)కు జోడిగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. సైరా సినిమాలో అమితాబ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
అత్యాధునిక అర్రీ అలెక్సా టెక్నాలజీతో ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కిస్తున్నారు. అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకూ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్ షూటింగ్ కోసం ప్రాజెక్ట్ కే ముస్తాబవుతుంది. ప్రభాస్ (Prabhas)సోలో సీన్స్ ఈ షెడ్యూల్‌లో తీయబోతున్నారట. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు ప్రాజెక్ట్ కే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
Follow Us