టాలీవుడ్ అందాల తార, టాప్ హీరోయిన్ పూజ హెగ్డే(Pooja Hegde)కు భారత ప్రభుత్వం ఓ అరుదైన అవకాశాన్ని కల్పించింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు భారత ప్రతినిధిగా పూజా హెగ్డేను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు మే 17 నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఫెస్టిఫల్ దాదాపు పది రోజుల పాటు జరగనుంది. మే 28 వరకు కొనసాగే కేన్స్ ఫెస్టివల్‌కు పూజ హెగ్డే భారత ప్రతినిధిగా హాజరవుతారు.
సౌత్ స్టార్‌గా దూసుకెళుతున్న పూజ హెగ్డే (Pooja Hegde) తొలి సారి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలకు హాజరవుతున్నారు. ఫ్రాన్స్‌లో జరిగే 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు పూజతో పాటు అక్షయ్ కుమార్, తమన్నా, మాధవన్ హాజరవుతున్నారు.
భారత దేశ ప్రతినిధిగా పూజ స్పెషల్ ఎట్రాక్షన్‌గా కనిపించనున్నారు. పూజ హెగ్డె ఎలాంటి మేకప్, కాస్ట్యూమ్స్‌లో వేడుకల్లో మెరవనుందో చూడాలి.
నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో పూజా హెగ్డే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత వరుణ్ హీరోగా పరిచయమైన ముకుందా సినిమాలో నటించారు. గోపికమ్మ సాంగ్‌తో పూజకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. టాప్ హీరోలతో హిట్ సినిమాల్లో నటిస్తున్న పూజ(Pooja Hegde) క్రేజీ హీరోయిన్ అయ్యారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు వెళ్లడంపై పూజ హెగ్డే అభిమానులు హ్యాపీగా ఉన్నారు.
Follow Us