అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది పూజా హెగ్డే (Pooja Hegde). తర్వాత వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ‘ముకుంద’ చిత్రంలో ‘గోపికమ్మ’ పాటతో పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత ఇండస్ట్రీలోని దాదాపు అందరు హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నటించిన ఆచార్య సినిమాలో చరణ్ సరసన నటించింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ మహేష్ బాబు సరసన ‘మహర్షి’, అఖిల్ సరసన ‘మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచ్‌లర్’, ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’, ఇటీవల ప్రభాస్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’లో నటించి మంచిపేరు తెచ్చుకుంది. హీరోయిన్గా బిజీగా ఉన్నా కూడా రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడింది పూజ.ప్రస్తుతం తెలుగు, హిందీల్లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది పూజా హెగ్డే.
బాలీవుడ్ అందగాడు హ్రితిక్ రోషన్ హీరోగా వచ్చిన ఆల్‌టైమ్ హిట్ సినిమా ‘కోయి మిల్ గయా’. ఆ సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి పూజ చెప్పుకొచ్చింది. తనకు హ్రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది పూజ. ‘కోయి మిల్ గయా’ సినిమా టైంలో నాకు పన్నెండేళ్లు. హ్రితిక్తో ఫోటో దిగాలని ఆ సినిమా ప్రీమియర్ షోకు వెళ్లాను. అయితే ఫోటో కోసం ప్రయత్నిస్తుంటే హ్రితిక్ స్టేజీ దిగి వెళ్లిపోయారు. ఆ సమయంలో నా హృదయం ముక్కలైనట్టు అనిపించింది.
సుమారు పది సంవత్సరాల తర్వాత పూజా హెగ్డే (Pooja Hegde), హ్రితిక్ రోషన్ హీరోహీరోయిన్లుగా ‘మొహంజదారో’ సినిమాలో నటించారు. ఇక ప్రస్తుతం పూజా హెగ్డే బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న సర్కస్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పూజాతోపాటు రణ్వీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Follow Us