Pinkvilla Style Icon Awards : పింక్‌విల్లా స్టైల్ ఐకాన్ అవార్డ్స్ విజేతల వివరాలు.. మీకోసం ప్రత్యేకం !

Pinkvilla Style Icon Awards

Pinkvilla Style Icon Awards : పింక్‌విల్లా సంస్థ  జూన్ 16వ తేదిన ముంబయి జేడబ్ల్యూ మారియట్ హోటల్ వేదికగా.. సినీ ఇండస్ట్రీతో పాటు వివిధ వ్యాపార, రాజకీయ, ఫ్యాషన్ రంగాలకు చెందిన ప్రముఖులకు స్టైల్ ఐకాన్ అవార్డులను ప్రదానం చేసింది. ఎందరో సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేసి, ఫ్యాషన్ వాక్‌లు.. స్టార్ నైట్‌లతో కూడిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. 

 

ప్రముఖ నటుడు రణ్ వీర్ సింగ్ ఈ వేడుకలో సూపర్ స్టైలిష్ మెగా పెర్ఫార్మర్ అవార్డును పొందాడు. Pinkvilla Style Icon Awards (పింక్ విల్లా స్టైల్ ఐకాన్ అవార్డ్స్) గురించి ఈయన  ప్రత్యేకంగా మాట్లాడుతూ, తను ఈ ఈవెంట్‌ను గొప్పగా ఎంజాయ్ చేశానని పేర్కొన్నాడు. తనను కూడా స్టైల్ ఐకాన్‌గా ఎంపిక చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు చెబుతున్నానని తెలిపాడు.

 

Pinkvilla Style Icon Awards (పింక్ విల్లా స్టైల్ ఐకాన్ అవార్డ్స్) వేడుకలలో  సూపర్ స్టైలిష్ యాక్టర్ (మేల్) రీడర్ ఛాయిస్ అవార్డును పొందిన ఆయుష్మన్ ఖురానా మాట్లాడుతూ, ఇలాంటి అవార్డులు తన బాధ్యతలను మరింత పెంచుతున్నాయని తెలిపాడు. బాలా, అంధాదూన్, గులాబో సితాబో లాంటి సినిమాల ద్వారా ఆయుష్మన్ ఖురానా మంచి నటుడిగా పేరు పొందాడు. 

 

Pinkvilla Style Icon Awards (పింక్ విల్లా స్టైల్ ఐకాన్ అవార్డ్స్) వేడుకలలో సూపర్ స్టైలిష్ యాక్టర్ (మేల్) అవార్డు  పొందిన సిద్దార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ ఈ వేడుక చాలా వైభవంగా జరిగిందని.. తనకు ఈ స్టైల్ ఐకాన్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. 

 

Pinkvilla Style Icon Awards (పింక్ విల్లా స్టైల్ ఐకాన్ అవార్డ్స్) వేడుకలలో ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ సందడి చేశారు. మంచి స్టైలిష్ లుక్‌తో ఆయన ఈ అవార్డు కార్యక్రమానికి హాజరయ్యారు. సూపర్ స్టైలిష్ స్వాగ్ ఐకాన్ అవార్డును పొందిన ఆయన .. ఈ పురస్కారాన్ని తాను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలిపారు. 

 

Pinkvilla Style Icon Awards (పింక్ విల్లా స్టైల్ ఐకాన్ అవార్డ్స్) వేడుకలలో ప్రముఖ నటి కైరా అద్వానీ సూపర్ స్టైలిష్ యాక్టర్ (ఫిమేల్) అవార్డును అందుకున్నారు. ఈమె బాలీవుడ్ చిత్రాలతో పాటు టాలీవుడ్ చిత్రాలలో కూడా నటించారు. 'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ బాబు సరసన .. అలాగే 'వినయ విధేయ రామ' చిత్రంలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటించారు. 

 

Pinkvilla Style Icon Awards (పింక్ విల్లా స్టైల్ ఐకాన్ అవార్డ్స్) వేడుకలలో నటి క్రితి సనన్ సూపర్ స్టైలిష్ యాక్టర్ (ఫిమేల్) అవార్డును రీడర్స్ ఛాయిస్ విభాగంలో అందుకున్నారు. క్రితి సనన్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. నేనొక్కడినే, దోచేయ్ లాంటి తెలుగు సినిమాలలో కూడా నటించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రంలో కూడా క్రితి నటిస్తున్నారు. 

 

విజేతల పూర్తి వివరాలు

సూపర్ స్టైలిష్ మెగా పెర్ఫార్మర్ : రణ్‌వీర్ సింగ్

సూపర్ స్టైలిష్ యాక్టర్ (మేల్) పాపులర్ ఛాయిస్ : సిద్దార్థ్ మల్హోత్రా

సూపర్ స్టైలిష్ యాక్టర్ (ఫిమేల్) : సారా అలీ ఖాన్

సూపర్ స్టైలిష్ షో బిజ్ ఐకాన్ : కరణ్ జోహార్

సూపర్ స్టైలిష్ హోస్ట్ : మనీష్ పాల్

సూపర్ స్టైలిష్ మూవీ హంకో : భూషణ్ కుమార్

సూపర్ స్టైలిష్ యాక్టర్ (మేల్) : కార్తిక్ ఆర్యన్

సూపర్ స్టైలిష్ యాక్టర్ (ఫిమేల్) : కైరా అడ్వానీ

సూపర్ స్టైలిష్ యాక్టర్ మేల్ రీడర్ ఛాయిస్ : ఆయుష్మన్ ఖురానా

సూపర్ స్టైలిష్ యాక్టర్ ఫిమేల్ రీడర్ ఛాయిస్ : క్రితి సనన్

సూపర్ స్టైలిష్ యూత్ ఐడల్ (ఫిమేల్) : జాన్వి కపూర్

సూపర్ స్టైలిష్ ఇన్స్పిరేషనల్ యూత్ ఐడల్ (మేల్): వరుణ్ ధావన్

సూపర్ స్టైలిష్ మౌల్డ్ బ్రేకర్ (మేల్) : అర్జున్ కపూర్

సూపర్ స్టైలిష్ మౌల్డ్ బ్రేకర్ (ఫిమేల్) : పరిణీతి చోప్రా

సూపర్ స్టైలిష్ టైమ్ లెస్ ఐకాన్ : అనిల్ కపూర్

సూపర్ స్టైలిష్ బ్రేక్ త్రూ స్టార్ : నష్రత్ బరుచ్చా

సూపర్ స్టైలిష్ ఎమర్జింగ్ టాలెంట్ : అభిమన్యు దాసాని

సూపర్ స్టైలిష్ ఎమర్జింగ్ టాలెంట్ (ఫిమేల్) : మానుషి చిల్లర్

సూపర్ స్టైలిష్ గ్లామ్ స్టార్ : సన్నీ లియోన్

సూపర్ స్టైలిష్ మావరిక్ స్టార్ : రాధిక మదన్

సూపర్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ : కబీర్ ఖాన్

సూపర్ స్టైలిష్ టీవీ స్టార్ అవార్డ్ (మేల్) : నకుల్ మెహతా

సూపర్ స్టైలిష్ స్వాగ్ ఐకాన్ : జాకీ ష్రాఫ్

సూపర్ స్టైలిష్ టీవీ స్టార్ (ఫిమేల్) : నియా శర్మ

సూపర్ స్టైలిష్ టీవీ కపుల్ : కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్

సూపర్ స్టైలిష్ మ్యూజిక్ పర్సనాలిటి : జస్లీన్ రాయల్

సూపర్ స్టైలిష్ హాట్ స్టెప్పర్ : వాణీ కపూర్ 

సూపర్ స్టైలిష్ పొలిటీషియన్ : శ్రీ కన్రాడ్ సంగ్మా

సూపర్ స్టైలిష్ బిజినెస్ మ్యాన్ : అమన్ గుప్తా

సూపర్ స్టైలిష్ స్పోర్ట్స్ స్టార్ : శిఖర్ ధావన్

సూపర్ స్టైలిష్ ఫ్యాషన్ డిజైనర్ : మసబా గుప్తా

సూపర్ స్టైలిష్ చెఫ్ : రణ్వీర్ బ్రార్

సూపర్ స్టైలిష్ చరిష్మాటిక్ దివా : హీనా ఖాన్

సూపర్ స్టైలిష్ ఎటర్నల్ లెజెండ్ : ఆశా పరేఖ్
 

You May Also Like These