పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘ఖుషి’ సినిమా రీమేక్ ఆ హీరోకే సాధ్యం.. సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కామెంట్లు

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ చేస్తున్న జల్సా సినిమా ట్రైలర్‌‌ను రిలీజ్‌ చేశారు సాయి ధరమ్ తేజ్

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌‌ ఖుషి సినిమా. ఈ సినిమాలో పవన్ యాక్టింగ్, యాటిట్యూడ్‌కు పవన్‌ ఫ్యాన్స్ మెస్మరైజ్ అయ్యారు. ఈ సినిమాను రీమేక్ చేయాలంటే ఏ హీరో చేయగలరనే ప్రశ్నకు అదిరిపోయే సమాధానం ఇచ్చారు సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్(Sai Dharam Tej).

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్ హీరోగా డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’. కేతిక శర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌‌ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించింది చిత్ర యూనిట్.

వన్‌ అండ్‌ ఓన్లీ స్టార్..

రంగ రంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌లుగా సాయిధరమ్‌ తేజ్, వరుణ్‌ తేజ్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో యాంకర్ సుమ వైష్ణవ్, సాయిధరమ్, వరుణ్‌లను పలు ప్రశ్నలు అడిగారు. పవర్ స్టార్ నటించిన ‘ఖుషి’ సినిమాను మీలో ఎవరు రీమేక్ చేస్తే సెట్ అవుతారు అని ప్రశ్నించారు.

 ఆ రోల్ చేయగలిగిన హీరో వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ మాత్రమే అని సమాధానం ఇచ్చారు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej).  పవన్ కల్యాణ్ (Pawan Kalyan), భూమిక చావ్లా హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ సినిమా 2001లో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎస్‌ జే సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్‏గా నిలిచింది.

Read More : పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కు డబుల్ థమాకా.. ‘జల్సా’తోపాటు ‘తమ్ముడు’ సినిమా కూడా!

You May Also Like These