Pawan Kalyan: పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తీస్తున్న సినిమా భవదీయుడు భగత్ సింగ్. పవన్‌తో తీస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాదని శంకర్ క్లారిటీ ఇచ్చారు. పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ పవర్ స్టార్‌తో చేస్తున్న మూవీ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
దర్శకుడు హరీష్ శంకర్ (Harish-Shankar) పదేళ్ల క్రితం పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్ సినిమా చేశారు. గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. మళ్లీ పదేళ్ల తర్వాత పవన్, శంకర్ కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా రానుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. పింక్ విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ మూవీపై పలు విషయాలు షేర్ చేసుకున్నారు.
పవన్ కల్యాణ్‌తో హిట్ సినిమా తీయాలని హరీష్ శంకర్ అనుకుంటున్నారు. ఎలాంటి రిమార్క్ లేకుండా భవదీయుడు భగత్ సింగ్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించనున్నారు. పవర్ స్టార్‌పై ఉన్న అంచనాలను రీచ్ అయ్యేలా తన సినిమా ఉంటుదన్నారు. పవన్‌ను కొత్తగా చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి చేయడానికి సమయం పడుతుంది. గబ్బర్ సింగ్ తీసి అప్పుడే పదేళ్లు అవుతుందా అనిపించింది. సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్ పోస్టులతో పండుగ చేసుకున్నారు.
భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పవన్ ఓ లెక్చరర్‌గా కనిపిస్తారని హరీష్ చెప్పారు. కమర్షియల్ ఎంటర్ టైన్ సినిమాగా తీస్తున్నారట. ఆగస్టులో పవన్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుగుతుందన్నారు. ఊటీలో ఓ షెడ్యూల్ ఉంటుందని చెప్పారు. వాతావరణ పరిస్థితులను బట్టి ఊటి షూటింగ్ ప్లాన్ చేస్తామన్నారు. ఇక మిగతా షూటింగ్ అంతా హైదరాబాద్‌లోనే చేస్తామని హరీష్ చెప్పారు.
షో లే సినిమా తీసిన సలీం జావేద్‌కు హరీష్ శంకర్ పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. సలీం జావేద్ చూపించిన హీరోయిజాన్ని తాను తన సినిమాల్లో చూపిస్తానని అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఎనర్జీ వస్తుందని.. సినిమాలో క్యారెక్టర్లతో కనెక్ట్ అయి మరీ సినిమా తీస్తానని చెప్పుకొచ్చారు. గబ్బర్ సింగ్ డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన సినిమాల్లో డైలాగులకు ప్రాధాన్యత ఇస్తానని శంకర్ అన్నారు.
గబ్బర్ సింగ్‌లో పవన్ కల్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించారు. పోలీసులంటే ఖాకీ డ్రెస్ ఉంటుంది. పవన్ కల్యాణ్‌ను గబ్బర్ సింగ్‌లో 80 శాతం వరకు ఖాకీ డ్రెస్‌లోనే చూపించానని శంకర్ అన్నారు. ఆ సినిమాలో స్టైల్‌గా కనిపించే డ్రెస్సులు పవన్ కల్యాణ్ వేసుకోలేకపోయారన్నారు. ప్రస్తుతం తీస్తున్న భవదీయుడుభగత్ సింగ్‌లో పవన్ కల్యాణ్ డ్రెస్సులు అదిరిపోతాయన్నారు. పవర్ స్టార్ ఇంకా అందంగా కనిపించేలా చేస్తామన్నారు. ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ పవన్ పాత్రను మరింత హైలెట్ చేస్తాయన్నారు. పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేటప్పుడు.. దర్శకుడిగా కన్నా ఓ ఫ్యాన్‌గా అతనితో వర్క్ చేస్తారని శంకర్ చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్‌తో చేసే సినిమా పాన్ ఇండియా మూవీగా తీయడం లేదని శంకర్ చెప్పారు. భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) పూర్తిగా తెలుగు సినిమాగానే రిలీజ్ చేస్తామన్నారు. హరి హర వీరమల్లు సినిమా పాన్ ఇండియా మూవీగా రావొచ్చన్నారు. పక్కా కమర్షియల్ సినిమాగా ఉంటుందన్నారు. పూజ హెగ్డే పవన్‌కు జోడిగా నటిస్తున్నారు.
Follow Us