Salaar: పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) తో కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం, ప్రభాస్, ప్రశాంత్ నీల్ 'సలార్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
అయితే, యాక్షన్ సీన్స్‌ను అదిరిపోయే రేంజ్‌లో చూపించడానికి, ప్రశాంత్ నీల్ కొన్ని కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారట. అందులో భాగంగా, ప్రభాస్ లుక్స్ మార్చేందుకు ప్రశాంత్ నీల్ తెగ కష్టపడుతున్నారట. ప్రభాస్ రేంజ్‌ను మరింత పెంచేలా ఓ కొత్త లుక్‌లో ఆయనను ప్రేక్షకులకు చూపించాలని భావిస్తున్నారు.
సముద్రంలో ప్రభాస్ యాక్షన్ సీన్ కోసం అంత ఖర్చా?
కేజీఎఫ్ చాప్టర్ 2 సృష్టిస్తున్న రికార్డులతో ప్రశాంత్ నీల్ క్రేజ్ పెరిగింది. విపరీతమైన డిమాండ్ ఉన్న దర్శకుడిగా ప్రశాంత్ నీల్ మారారు. ఇక సలార్ (Salaar) సినిమాతో ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టనున్నారన్నది ఓ ప్రశ్న. సలార్ చిత్రంలోని ప్రతీ సీన్‌ను ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట.
ఈ చిత్రం కోసం రూపొందిస్తున్న, భారీ యాక్షన్ సీన్స్ ఆడియన్స్‌కు 100 శాతం నచ్చుతాయని సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు అంటున్నారు. ఇక క్లైమాక్స్ సీన్ మొత్తం సముద్రంలో తీస్తున్నారని టాక్. ప్రభాస్ సముద్రంలో చేసే పోరాట సన్నివేశాల కోసం, ఓ స్పెషల్ టెక్నాలజీని కూడా వాడనున్నారని వినికిడి. ఇక సలార్ (Salaar) క్లైమాక్స్ సీన్ కోసమే ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు పెట్టడం విచిత్రమే కదా.. అంటున్నారు సినీ విశ్లేషకులు.
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్సేనట
సలార్ (Salaar) చిత్రాన్ని తెలుగు భాషలో రూపొందిస్తున్నారు. అలాగే కన్నడం, మళయాళం, తమిళ్, హిందీ భాషల్లో డబ్ చేయనున్నారు. డీటీసీ టెక్నాలజీతో వస్తున్న మొదటి చిత్రం సలార్ (Salaar). వెండితెరపై డార్క్ షేడ్‌లో సినిమా కనిపించే విధంగా ఈ టెక్నాలజీని వాడుతున్నారు. ఇక ఇందులో ప్రభాస్ కోసం రూపొందించిన పోరాట సన్నివేశాలు, హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని టాక్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతి హాసన్ నటిస్తున్నారు. ఇక జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జగపతిబాబు విలన్‌గా అతి భయంకమైన గెటప్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 2023 లో సలార్ (Salaar) విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
Follow Us