సినిమాను ప్రేక్షకుడికి నచ్చేలా తెరకెక్కిస్తూనే అందులో మెసేజ్ కూడా ఉండేలా కేర్ తీసుకునే దర్శకుడు కొరటాల శివ (Koratala Siva). ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలలోనూ ఏదో ఒక మెసేజ్‌ను ప్రేక్షకులకు ఇచ్చాడు. ఈ కారణంగానే చాలా తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్‌గా ఎదిగాడు కొరటాల. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ నటించిన ఆచార్య సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తర్వాత తీయబోయే సినిమాపై మరింత శ్రద్ధ పెట్టాడీ క్రేజీ డైరెక్టర్
జూనియర్ ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజీ వంటి హిట్ అందుకున్న కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్ 30ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ సినిమాకు కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈసారి తాను చేసే సినిమాలో మెసేజ్ ఏం ఉండబోదని, పక్కా మాస్ ఎలిమెంట్స్‌తోనే ఎన్టీఆర్‌తో సినిమా ఉంటుందని అంటున్నట్టు ఇండస్ట్రీలో టాక్.
ఇక, ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్‌ను స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా చూపిస్తూ పొలిటికల్ సినిమా తీయాలని కొరటాల అనుకున్నాడు. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో ప్రేక్షకులు సందేశాలను రిసీవ్ చేసుకునే మూడ్‌లో లేరని అనుకుంటున్నాడని తెలుస్తోంది. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు కావాలని కోరుకుంటున్నారని కొందరి దగ్గర కొరటాల అన్నాడని సమాచారం.
ఎన్టీఆర్ కోసం బృందావనం సినిమాలాంటి మాస్ ఎలిమెంట్స్, డైలాగ్‌లతో స్క్రిప్ట్‌ను కొరటాల రెడీ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టుతో ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న మేసెజ్ గురించి కొరటాల (Koratala Siva) అసోసియేట్స్ అడుగగా ’ఈసారి మెసేజ్ ఏం లేదమ్మా. మాస్ అంతే’ అని చెబుతున్నాడట.
Follow Us